Updated On - 11:02 am, Mon, 8 February 21
Man cuts doctors finger for pay fee : ట్రీట్ మెంట్ చేశాక డాక్టర్లకు ఫీజులు ఇవ్వటం సర్వసాధారణం. కానీ కాలిన గాయాలతో ఆస్పత్రికి వచ్చిన ఓ బాధితుడికి డాక్టర్ ట్రీట్ మెంట్ చేసి తరువాత ఫీజు అడిగాడు.దానికి రెచ్చిపోయిన సదరు బాధితుడు..అతని కూడా వచ్చినవారు డాక్టర్ పై ఎదురు తిరిగారు. ఈ క్రమంలో చికిత్స చేసిన డాక్టర్ వేలు కొరికి అతి చేతిలో పెట్టాడు సదరు బాధితుడు. ఈ విచిత్ర ఘటనతో షాక్ అయిన డాక్టర్ వెంటనే పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వాడాలో చోటుచేసుకుంది.
చింద్వాడాలోని కుండీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శనిచరా బజార్‌లో డాక్టర్ ఎస్‌కే బింద్రా ఓ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఎంతోమంది పేషెంట్లకు చికిత్స చేస్తుంటారాయన. ఈ క్రమంలో శనివారం (జనవరి6) అర్ధరాత్రి 12 గంటలు అయ్యింది. డాక్టర్ బింద్రా..ఇక క్లినిక్ క్లోజ్ చేసి వెళ్లిపోదామనుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి చేతికి కాలిన గాయాలతో క్లినిక్‌కు వచ్చాడు. అతడితో సహాయంగా మరో ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు.
డాక్టర్ బింద్రా వెంటనే అతడికి చికిత్స చేశారు. అంనంతరం ఫీజు అడిగారు. దానికి బాధితుడు ఫీజు ఇవ్వకపోగా..అతనితో కూడా వచ్చినవారు కూడా రెచ్చిపోయారు. క్లినిక్‌పైనే దాడికి యత్నించారు. క్లినిక్ లోని పరికరాలు ధ్వంసం అవుతాయనే భయంతో డాక్టర్ బింద్రా వారిని అడ్డుకోబోయారు.
ఈ క్రమంలో సదరు ట్రీట్ మెంట్ చేయించుకున్న వ్యక్తి కూడా వచ్చిన విజయ్ తివారీ అనేవ్యక్తి డాక్టర్ బింద్రా వేలిని కొరికి వేలిని వేరు చేశాడు. అనంతరం క్లినిక్‌లోని వస్తువులల్ని కూడా ధ్వంసం చేసి వెళ్లిపోయారు. డాక్టర్ బింద్రా ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లినిక్ లో జరిగిన విధ్వంసం అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ ఘటనపై బాధిత డాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలకు పరిశీలించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
Shocking video : ఆక్సిజన్ ఆపేసి కరోనా రోగి ప్రాణాలు తీసిన ఆస్పత్రి సిబ్బంది
Minister Usha Thakur : కరోనా పోవాలంటూ పూజలు చేసిన మంత్రి
వైరల్ వీడియో: నిలువెత్తు నిర్లక్ష్యం.. కరోనా రోగితో రోడ్డుపైనే ఆంబులెన్స్!
Govt Employees : కరోనా ఫీవర్, ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజులే వర్కింగ్ డేస్
Mask less Man: మాస్క్ పెట్టుకోని వ్యక్తిని చితకబాదిన పోలీసుల సస్పెండ్
Madhya Pradesh : మాస్క్ పెట్టుకోలేదని ఆటోడ్రైవర్ ను కుమ్మేసిన పోలీసులు