Raj Kundra: అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రాకు బెయిల్

అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు రూ .50 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

Raj Kundra: అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రాకు బెయిల్

Mumbai Court Grants Bail To Raj Kundra In Pornography Case

Pornography Case: అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు రూ .50 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను జూలై 19న అరెస్టు చేయగా.. అతనిపై భారతీయ శిక్షాస్మృతి మరియు సమాచార సాంకేతికత చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. అప్పటినుంచి జైలులో ఉన్న రాజ్ కుంద్రాకు ఇప్పుడు బెయిల్ లభించింది. అరెస్టైన రెండు నెలల తర్వాత బెయిల్‌ రావడంతో కుంద్రా బయటకు రానున్నారు.

రూ.50వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా.. పోర్నోగ్రఫీ కేసులో 1400 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు ముంబై పోలీసులు. బ్రిటన్ సిటిజన్ గా ఉన్న రాజ్ కుంద్రా దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందంటూ పోలీసులు భావించగా.. ఇప్పటికే ఎన్నోసార్లు కుంద్రా బెయిల్ నిరాకరించబడింది. ఈ క్రమంలోనే కుంద్రా పాస్ పోర్ట్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

యాప్ యూజర్లు మూడు రెట్లు పెంచుకోవడమే లక్ష్యంగా రాజ్ కుంద్రా ప్లాన్ చేశాడని, రెండేండ్లలో 8రెట్ల లాభం పొందాలని భావించాడని, 119 అశ్లీల చిత్రాలను నిర్మించి, రూ.8.84 కోట్లకు అమ్మాలని అనుకున్నట్లు చార్జిషీట్‌లో పెట్టారు అధికారులు. రాజ్ కుంద్రా ఫస్ట్ యాప్‌ బ్యాన్ అవ్వగా.. మరో యాప్‌ను రూపొందించాడని, డిజిటల్ మీడియాను ఉపయోగించుకుని అక్రమంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేసినట్లుగా గుర్తించారు.

అశ్లీల చిత్రాల విషయం బయటపడిన తర్వాత డేటాను సీక్రెట్‌గా పెట్టుకునే ప్రయత్నం చేశారని, కుదరకపోవడంతో డిలేట్ చేసి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడని చెప్పారు. ఈ విషయాలను ముంబై పోలీసులు చార్జిషీట్‌లో వెల్లడించారు. మడ్ ఐల్యాండ్‌లోని ఓ భవంతిపై పోలీసులు దాడులు జరిపిన సందర్భంలో అశ్లీల చిత్రాల నిర్మాణం విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

రాజ్‌ కుంద్రా సంస్థలో పనిచేస్తున్న ఉమేష్‌ కామత్‌ అనే వ్యక్తి అశ్లీల చిత్రాలను నిర్మించి, వాటిని లండన్‌లోని రాజ్‌ కుంద్రా బామ్మర్ది ప్రదీప్‌ బక్షికి పంపేవాడని, అక్కడ ఉమేశ్‌ కామత్‌ అశ్లీల చిత్రాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేసేవాడని పోలీసులు చెప్పారు. ఛార్జ్‌షీట్ ప్రకారం, ‘హాట్‌షాట్’ యాప్ ఖాతా, ‘హాట్‌షాట్’ టేక్ డౌన్ అనే రెండు వాట్సాప్ గ్రూపులు ఉమేష్ మొబైల్‌లో గుర్తించారు