Naga Chaitanya : శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుడు జీవితం ఆధారంగా నాగచైతన్య సినిమా.. వేటకెల్లి పాక్ కోస్ట్ గార్డ్‌కి చిక్కి..

2018లో గుజరాత్ విరావల్ నుండి వేటకెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుడు అనుకోకుండా పాక్ (Pakistan) కోస్ట్ గార్డ్‌కి చిక్కిన కథతో నాగచైతన్య సినిమా.

Naga Chaitanya : శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుడు జీవితం ఆధారంగా నాగచైతన్య సినిమా.. వేటకెల్లి పాక్ కోస్ట్ గార్డ్‌కి చిక్కి..

Naga Chaitanya chandoo mondeti movie based on 2018 Fisherman caught by pakistan incident

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ఇటీవల కస్టడీ సినిమాతో తెలుగుతో పాటు తమిళ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టాడు. ఇప్పుడు తన తదుపరి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో తనతో ప్రేమమ్‌, సవ్యసాచి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు చందూ ముండేటితో చైతన్య తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ ఒక రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఉండబోతుందని, చైతన్య ఈ సినిమాలో మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడని ఇప్పటికే దర్శకుడు తెలియజేశాడు.

Bro Movie : ‘కాంబాబు రాసలీలలు’ మూవీ పోస్టర్ రిలీజ్.. సంజన, సుకన్య క్యాప్షన్.. త్వరలో గంటా, అరగంట..!

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాత బన్నీవాసు, చైతన్య అండ్ చందూ ముండేటి ఎచ్చెర్ల మండలం కె మత్స్యలేశం గ్రామానికి చేరుకున్నారు. స్థానిక మత్స్య కారులతో మాట్లాడి వారి జీవన విధానం, స్థితిగతులను పరిశీలించడానికి చైతన్య అండ్ టీం అక్కడికి వచ్చినట్లు తెలియజేశారు. ఈ సినిమా కోసం నాగచైతన్య కూడా ఎంతో హోమ్ వర్క్ చేస్తున్నాడు. ఇటీవల పాండిచ్చేరిలోని ఆదిశక్తి యాక్టింగ్ అకాడమీకి వెళ్లి యాక్టింగ్ లో మరిన్ని మెలకువలు నేర్చుకొని వచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Naga Chaitanya (@chayakkineni_official)

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. సిక్కోలు మత్స్యకారుల యాస, బాస, వ్యవహారి శైలలో సినిమాని రియలిస్టిక్ గా తీయబోతున్నాము అంటూ తెలియజేశాడు. 2018లో గుజరాత్ విరావల్ నుండి వేటకెళ్లిన 21 మంది మత్స్యకారులు అనుకోకుండా పాక్ (Pakistan) కోస్ట్ గార్డ్‌కి చిక్కారు. ఆ సమయంలో కేంద్రం సంప్రదింపులు జరపడంతో ఆ మత్స్యకారులు పాక్ చెరనుండి బయటబడ్డారు. ఇప్పుడు ఆ కథని ఆధారంగా తీసుకునే ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు. పాక్ కోస్ట్ గార్డ్స్ కి చిక్కిన మత్స్యకారుల్లో కె మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుడు గణగల్ల రామరావు కూడా ఒకడు.

Trivikram Srinivas: రాజకీయ యుద్ధంలో చిక్కుకున్న మాటల మాంత్రికుడు!

గుజరాత్ నుండి చేపల వేటకు వెళ్ళి పాకిస్తాన్ అధికారులకు చిక్కి అక్కడే రెండేళ్లు జైలు జీవితాన్ని గడిపాడు. అతని జీవితానే ఇతివృత్తంగా తీసుకోని అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు అనే కథని సస్పెన్స్ గా చూపిస్తూ.. స్వచ్ఛమైన ప్రేమ కథ, ట్విస్ట్‌లు, ఎమోషన్స్‌తో మధ్య సినిమా తెరకెక్కించి ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాని అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాడు. పాన్ ఇండియా సబ్జెక్టు కాబట్టి.. మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.