Naga Shaurya : నడిరోడ్డులో యువతి పై చెయ్యి చేసుకున్న వ్యక్తిని నిలదీసిన హీరో నాగశౌర్య..
సినిమాల్లో అమ్మాయిలకు ఏమన్నా జరిగితే హీరోలు వచ్చి ఫైట్ చేసే సన్నివేశాలు మన చూస్తూనే ఉంటాము. తాజాగా అటువంటి ఇన్సిడెంట్ రియల్ గా జరిగింది. టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య..

Nagashaurya is the hero who stopped the man who put his hands on the young woman on the road
Naga Shaurya : సినిమాల్లో అమ్మాయిలకు ఏమన్నా జరిగితే హీరోలు వచ్చి ఫైట్ చేసే సన్నివేశాలు మన చూస్తూనే ఉంటాము. తాజాగా అటువంటి ఇన్సిడెంట్ రియల్ గా జరిగింది. టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య.. తన కళ్ళ ముందు జరుగుతున్న ఒక సంఘటన నిలదీసి రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. కారులో వెళుతున్న నాగశౌర్యకు నడిరోడ్డు పై ఒక అబ్బాయి ఒక అమ్మాయి పై చెయ్యి చేసుకోవడం చూశాడు. వెంటనే కారు దిగి ఆమె పై ఎందుకు చెయ్యి చేసుకున్నావు అంటూ నిలదీశాడు.
Naga Shaurya: నాగశౌర్య ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి రిలీజ్ డేట్ ఫిక్స్
ఆమెకు క్షమాపణ చెప్పాలి అంటూ ఆ అబ్బాయిని కోరాడు. కానీ అతను మాత్రం క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. ఆమె నా లవర్ నా ఇష్టం అంటూ బదులివ్వడంతో.. నాగశౌర్య అతని చెయ్యి పట్టుకొని క్షమాపణ చెప్పే వరకు వదిలేదు లేదంటూ చెప్పాడు. ఈ సంఘటనకి సంబంధించిన వీడియో బయటకి రావడంతో, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు.. మహిళల పట్ల నాగశౌర్య చూపించిన గౌరవ మర్యాదలకు హ్యాట్సాఫ్ అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం రకరకాల పనులు చేస్తున్న తరుణంలో.. ఇది నిజామా? ప్రాంకా? అని కొందరు కన్‌ఫ్యుజ్ అవుతున్నారు.
ప్రస్తుతం నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలో నటిస్తున్నాడు. అవసరాల శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ మంచి విజయం అందుకోవడంతో ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మరి ఈ సినిమాతో కూడా దర్శకుడు, హీరో హిట్ కొడతారా? లేదా? చూడాలి. మార్చి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.