Naveen Polishetty : వరుస సినిమాలతో బిజీగా మారిన నవీన్ పోలిశెట్టి..

డిసెంబర్ 26న నవీన్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాల అప్‌డేట్స్ ఇచ్చారు మేకర్స్..

Naveen Polishetty : వరుస సినిమాలతో బిజీగా మారిన నవీన్ పోలిశెట్టి..

Naveen Polishetty

Updated On : December 27, 2021 / 11:41 AM IST

Naveen Polishetty: ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘చిచ్చోరే’ (హిందీ) సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి. డిసెంబర్ 26న నవీన్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తను నటిస్తున్న కొత్త సినిమాల అప్‌డేట్స్ ఇచ్చారు మేకర్స్.

Natti Kumar : పెంచిన టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తా – నట్టి కుమార్..

నవీన్ హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రంలో డిసెంబర్ నెలాఖరు నుంచి జాయిన్ కానున్నాడు నవీన్. ఇందులో మరో ప్రధాన పాత్రలో అనుష్క శెట్టి నటిస్తున్నారు. ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలు నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార సంస్థ కలిసి నవీన్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నుండి నవీన్ లుక్ రిలీజ్ చేశారు. త్వరలో టైటిల్ అనౌన్స్ చెయ్యనున్నారు.