Nithin : 20 ఏళ్ళ ప్రయాణం.. మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో..

ఈ పోస్ట్ లో.. ''డియర్‌ ఫ్రెండ్స్‌.. 20 ఏళ్ల కిందట నా మొదటి సినిమా అయిన జయంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈ ప్రయాణం గురించి ఎలా చెప్పాలో కూడా మాటలు రావడం లేదు. మొదటగా నాలోని నటుడిని గుర్తించి..............

Nithin : 20 ఏళ్ళ ప్రయాణం.. మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో..

Nithin

Nithin :  జయం సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నితిన్‌. దిల్‌, సై, సంబరం.. లాంటి పలు సినిమాలతో వరుస హిట్స్ సాధించాడు. ఆ తర్వాత కొద్దిగా తడబడినా ఇష్క్‌ సినిమాతో కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ వరుస విజయాలు సాధించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు నితిన్. త్వరలో మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. 2002లో ‘జయం’ సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన నితిన్ తాజాగా నటుడిగా 20 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పలువురికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

Sai Pallavi : గత జన్మలో తెలంగాణలో పుట్టానేమో

ఈ పోస్ట్ లో.. ”డియర్‌ ఫ్రెండ్స్‌.. 20 ఏళ్ల కిందట నా మొదటి సినిమా అయిన జయంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈ ప్రయాణం గురించి ఎలా చెప్పాలో కూడా మాటలు రావడం లేదు. మొదటగా నాలోని నటుడిని గుర్తించి నాకు జయం సినిమాలో అవకాశం ఇచ్చిన తేజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా సినీ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, వ్యక్తిగత సిబ్బంది.. ఇలా నాతో పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో. ఈ అద్భుతమైన ప్రయాణంలో నాకు ఎంతోమంది అండగా నిలిచారు. కెరీర్‌లో కష్టాలు ఎదురైనప్పుడు ఎంతో సహకరించారు. ముఖ్యంగా నా అభిమానులు.. ఇన్నేళ్లుగా అభిమానిస్తూ, నాపై నమ్మకాన్ని ఉంచి గెలుపోటముల్లో నా వెన్నంటే ఉంటూ వచ్చిన నా అభిమానులకు ఎప్పటికి రుణపడి ఉంటాను” అని ఎమోషనల్‌గా ట్వీట్ చేశాడు నితిన్‌.