Nitish Kumar: మ‌త‌మార్పిడి వ్య‌తిరేక చ‌ట్టం అవ‌స‌రం లేదు: నితీశ్ కుమార్

దేశంలో మ‌త మార్పిడి వ్య‌తిరేక చ‌ట్టం తీసుకురావాలంటూ ప‌లువురు బీజేపీ నేత‌లు వ్యాఖ్య‌లు చేస్తోన్న నేప‌థ్యంలో ఆ పార్టీ మిత్ర‌ప‌క్షం జేడీయూ అధినేత‌, బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ చ‌ట్టం అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

Nitish Kumar: మ‌త‌మార్పిడి వ్య‌తిరేక చ‌ట్టం అవ‌స‌రం లేదు: నితీశ్ కుమార్

Nitish

bihar: దేశంలో మ‌త మార్పిడి వ్య‌తిరేక చ‌ట్టం తీసుకురావాలంటూ ప‌లువురు బీజేపీ నేత‌లు వ్యాఖ్య‌లు చేస్తోన్న నేప‌థ్యంలో ఆ పార్టీ మిత్ర‌ప‌క్షం జేడీయూ అధినేత‌, బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ చ‌ట్టం అవ‌స‌రం లేద‌ని చెప్పారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. “మా ప్ర‌భుత్వం ఎల్ల‌ప్పుడూ అప్ర‌మ‌త్తంగానే ఉంటుంది. అన్ని మ‌తాల‌కు చెందిన వారు ఇక్క‌డ శాంతియుత జీవనాన్ని కొన‌సాగిస్తున్నారు. రాష్ట్రంలో మ‌త‌మార్పిడి వ్య‌తిరేక చ‌ట్టం తీసుకురావాల్సిన అవ‌స‌రం లేదు” అని నితీశ్ కుమార్ చెప్పారు.

కాగా, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ లాంటి వారు మ‌త మార్పిడి వ్య‌తిరేక చ‌ట్టం తీసుకురావాల‌ని అంటోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే బీజేపీకి,  నితీశ్ కుమార్ పార్టీ జేడీయూకు మ‌ధ్య దూరం పెరిగింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కుల గ‌ణ‌న విష‌యంలోనూ ఇరు పార్టీల తీరు విభిన్నంగా ఉంది. అలాగే, అయోధ్య‌, ఆర్టిక‌ల్ 370, ఉమ్మ‌డి పౌర‌స్మృతి, ముమ్మారు త‌లాక్‌, ఎన్ఆర్సీ, జ‌నాభా నియంత్ర‌ణ వంటి అంశాల‌పై కూడా బీజేపీ, నితీశ్ కుమార్ వైఖ‌రులు వేర్వేరుగా ఉన్నాయి.