Nokia G20 : భారత్‌లో నోకియా బడ్జెట్ ఫోన్ ఎంట్రీ.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

నోకియా బ్రాండ్ నుంచి కొత్త మోడల్ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లోకి చడిచప్పుడు కాకుండా Nokia G20 ఫోన్ లాంచ్ అయింది. ఎప్పుడు లాంచ్ అయిందో తెలియదు కానీ.. అమెజాన్ సేల్ లిస్టులో ఈ కొత్త ఫోన్ దర్శనమిచ్చింది.

Nokia G20 : భారత్‌లో నోకియా బడ్జెట్ ఫోన్ ఎంట్రీ.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

Nokia G20 Silently Launched In India At Rs 12,999

Updated On : July 5, 2021 / 3:52 PM IST

Nokia G20 Launch – Amazon India : ప్రముఖ HMD సంస్థ నోకియా బ్రాండ్ నుంచి కొత్త మోడల్ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లోకి చడిచప్పుడు కాకుండా Nokia G20 ఫోన్ లాంచ్ అయింది. ఎప్పుడు లాంచ్ అయిందో తెలియదు కానీ.. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సేల్ లిస్టులో ఈ కొత్త ఫోన్ Nokia G20 దర్శనమిచ్చింది. ఫోన్ ధరతో పాటు సేల్ డేట్ కూడా వచ్చేసింది. HMD సంస్థ నుంచి వచ్చే బడ్జెట్ ఫోన్ ఇది.. భారత మార్కెట్లో దీని ధర రూ.13వేల కంటే తక్కువగానే ఉండనుంది.

యూరోపియన్ ధరను భారత కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దాదాపు రూ.14 వేల వరకు ఉంటుంది. వచ్చే జూలై 7న అమెజాన్‌లో Nokia G20 ఫోన్ మార్కెట్లోకి రానుంది. Nokia X20 5G ఫోన్ లాంచ్ గురించి అమెజాన్ కూడా అధికారికంగా ప్రకటించలేదు. గత ఏప్రిల్ నెలలో HMD సంస్థ ఆరు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. అందులో Nokia X20, Nokia X10, Nokia G20, Nokia G10, Nokia C20, Nokia C10 మోడల్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో X- సిరీస్ ఫోన్లలో 5G నుంచి ఉన్నాయి. మిగిలినవి 4G ఫోన్లే.. నోకియా 5G ఫోన్లలో X20, X10 రెండు ఉన్నాయి.

Nokia G20 ధర ఎంతంటే?:
HMD సంస్థ Nokia G20 ఫోన్ ధర రూ.12,999గా ఉండనుంది. బేస్ వేరియంట్ 4GB RAM, 64GB ఇంటర్నల్ మెమెరీతో వచ్చింది. దీంతో పాటు 128GB స్టోరేజీ వేరియంట్ కూడా ఉందో లేదో క్లారిటీ లేదు. అలాగే అమెజాన్ ఫస్ట్ సేల్ నాటికి అందుబాటులో ఉంటుందో లేదో తెలియదు. Amazon India ఫస్ట్ సేల్ జూలై 7 నుంచి అందుబాటులో ఉండనుంది. అలాగే Nokia ఆన్ లైన్ స్టోర్ లోకి అందుబాటులో ఉండనుంది.

Nokia G20 Specifications :
Display: 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో.
Processor: మీడియా టెక్ హెలియో G35 ప్రాసెసర్.
RAM-Storage : 4GB RAM + 64GB, 128GB స్టోరేజీ, మైక్రోSD కార్డ్ స్లాట్.
Rear Cameras: 48MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మైక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సింగ్ కెమెరా
Front Camera: 8MP ఫ్రంట్ కెమెరా
Battery : 5050mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్, USB-C పోర్ట్
Operating System : ఆండ్రాయిడ్ 11, రెండేళ్ల పాటు అప్ గ్రేడేషన్