Cinnamon : బరువు తగ్గించటమేకాదు, రక్తప్రసరణ వ్యవస్ధను మెరుగుపరిచే దాల్చిన చెక్క!

గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల అది కీళ్ళ నొప్పులు కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

Cinnamon : బరువు తగ్గించటమేకాదు, రక్తప్రసరణ వ్యవస్ధను మెరుగుపరిచే దాల్చిన చెక్క!

Cinnamon

Cinnamon : దాల్చిన చెక్క ప్రాచీన కాలం నుండి గల ఒక సుగంధ ద్రవ్యం. దాల్చిన చెక్క చెట్ల నుండి తీసిన బెరడును ఎండబెట్టి, కట్టలా చుడతారు. అదే మనకు దొరికే దాల్చిన చెక్క. ఇవి చక్కని సుగంధాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా మనం వంటకాలలో ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు వున్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే కాక సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తుంది.

దాల్చిన చెక్క వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు వున్నాయి. దాల్చిన‌చెక్క‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. రకర‌కాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు దాల్చిన చెక్క‌లో ఉన్నాయి. దాల్చినచెక్కని నమిలి తినడం వల్ల నోటిదుర్వాసనని దూరం చేసుకోవచ్చు. ఇందులోని ప్రత్యేకగుణాలు నోటిలో దుర్వాసనని కలిగించే బ్యాక్టీరియాను అంతం చేస్తాయి. గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. దీన్ని వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు, చుండ్రు తగ్గుతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

నిద్రలేమి సమస్యను చాలామంది ఎదుర్కొంటుంటారు. అలాంటివారు. దాల్చినచెక్కని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రాత్రి పడుకునేముందు తాగితే నిద్రలేమి సమస్యనుంచి బయటపడొచ్చు. దాల్చినచెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి నుదురుకు కట్టులాగా వేస్తే జలుబు త్వరగా తగ్గుతుంది. జలుబు వల్ల వచ్చే తలనొప్పి, దగ్గు సమస్యలు కూడా దూరమవుతాయి. అధిక కొవ్వు కలిగి ఉండే ఆహారం తీసుకోవటం వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా దాల్చినచెక్క తగ్గిస్తుంది. దాల్చిన చెక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల అది కీళ్ళ నొప్పులు కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దాల్చిన నూనెతో మర్దన చేయడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. రెండు చుక్కల దాల్చిన నూనెను ఒక అర కప్పు గోరువెచ్చని నీటిలో వేసి పుక్కిలిస్తే దంత సమస్యలు, ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి

దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు అలనిన్ అనే ఎంజైమ్ ను శరీరంలో బ్లాక్ చేస్తుంది. ఇది ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ ను గ్రహించకుండా చేస్తుంది. అందుకే దాల్చిన చెక్క ద్రావణం మధుమేహం పేషంట్స్ కు చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా తగ్గిస్తుంది. మహిళలు నెలనెల రుతుక్రమ సమస్యలను ఎదుర్కొంటుంటారు. దాల్చిన చెక్కలో ఎక్కువగా యాంటీబాక్టీరియల్ గుణాలు ఉన్నందున రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. అలాంటి సమయంలోబియ్యం కడిగిన నీటిలో కొంచెం దాల్చినపొడిని కలిపి తాగడం వల్ల మహిళలు రుతుస్రావం సమస్యలను దూరం చేసుకోవచ్చు. దాల్చిన చెక్క మెదడుకు రక్షణ కల్పిస్తుంది. క్యాన్సర్ నివారించి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.