Omicron Variant: 89దేశాలకు పాకిన ఒమిక్రాన్.. 3రోజుల్లోనే కేసులు రెట్టింపు
కొవిడ్-19 వేరియంట్లలో అత్యంత మ్యూటేషన్ చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ 89దేశాలకు పాకిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఎక్కువ సంఖ్యలో మ్యూటేషన్స్ ఉన్న ఒమిక్రాన్‌లో.....

Who
Omicron Variant: కొవిడ్-19 వేరియంట్లలో అత్యంత మ్యూటేషన్ చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ 89దేశాలకు పాకిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఎక్కువ సంఖ్యలో మ్యూటేషన్స్ ఉన్న ఒమిక్రాన్‌లో 26 నుంచి 32 స్పైక్ ప్రొటీన్లు ఉన్నాయని తెలిసింది.
‘2021 డిసెంబర్ 16 నాటికి ఒమిక్రాన్ వేరియంట్ 89దేశాలకు పాకినట్లు తెలిసింది. అది కూడా WHOపరిధిలోని ఆరు ప్రాంతాల్లో డేటా మాత్రమే ఇది’ అని WHOలేటెస్ట్ అప్ డేట్ లో చెప్పింది. గతంలోని డెల్టా వేరియంట్ కంటే దీని వ్యాప్తి వేగంగా ఉందని పేర్కొన్నారు.
ఈ వేరియంట్ వల్ల నమోదవుతున్న కేసులు గత మూడ్రోజుల్లో రెట్టింపు అవుతున్నట్లు తెలిసింది. యూకే, దక్షిణాఫ్రికాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం చాలా బాధాకరంగా మారిందని డేటా చెప్తుంది. ‘వేరియంట్ పై వ్యాక్సిన్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందనే స్పష్టమైన డేటా తమ వద్ద లేదని’ డబ్ల్యూహెచ్‌ఓ చెప్తుంది.
…………………………………. : అండమాన్-నికోబార్ దీవుల్లో 100శాతం వ్యాక్సినేషన్