BiggBoss Non Stop : వన్ సెకండ్.. బిగ్‌బాస్ ఓటీటీలో ఓంకార్..

హోలీ ఎపిసోడ్ కి మరింత హైప్ తెచ్చేందుకు స్పెషల్ గెస్ట్ గా ఓంకార్ ని తీసుకొచ్చారు. హోలీ ఎపిసోడ్‌లో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఓంకార్ వన్ సెకండ్ అంటూ తన మార్క్ ని చూపించారు.

BiggBoss Non Stop : వన్ సెకండ్.. బిగ్‌బాస్ ఓటీటీలో ఓంకార్..

BiggBoss Non Stop :  బిగ్‌బాస్ మూడవ వారం కూడా పూర్తవ్వబోతుంది, బిగ్‌బాస్ నాన్ స్టాప్ పేరుతో ఈ సారి ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్నా అంతకు ముందు ఉన్న క్రేజ్ లేదు. అసలు ఈ సారి బిగ్‌బాస్ నడుస్తుందా అన్నట్టే సాగుతుంది. కానీ బిగ్‌బాస్ అభిమానులు మాత్రం షోని తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఇక అందులో ఉన్న కంటెస్టెంస్ట్ అభిమానులు మాత్రం వాళ్ళ కోసం షో చూస్తూ వాళ్ళకి ఓట్లు వేస్తూ సపోర్ట్ చేస్తున్నారు.

గతంలో పోలిస్తే బిగ్‌బాస్ ఓటీటీకి క్రేజ్ తగ్గడంతో హైప్ తీసుకురావడానికి మరింత ప్రయత్నిస్తున్నారు బిగ్‌బాస్ టీం. తాజాగా హోలీ ఎపిసోడ్ ని కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు బిగ్‌బాస్ లో. ఇందులో కంటెస్టెంట్స్ హోలీ కూడా జరుపుకున్నారు. హోలీ ఎపిసోడ్ కి మరింత హైప్ తెచ్చేందుకు స్పెషల్ గెస్ట్ గా ఓంకార్ ని తీసుకొచ్చారు. హోలీ ఎపిసోడ్‌లో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఓంకార్ వన్ సెకండ్ అంటూ తన మార్క్ ని చూపించారు.

Mahesh Babu : నాన్న నిన్ను గర్వపడేలా చేస్తా అంటున్న సితార

ఓంకార్ తనదైన శైలిలో ఆకట్టుకుంటూ కాసేపు హోస్టింగ్ కూడా చేశారు. ‘పంజా’ సినిమా టైటిల్ సాంగ్‌తో గ్రాండ్ గా హ్యాపీ హోలీ చెప్తూ ఎంట్రీ ఇచ్చారు ఓంకార్. ఆ తరవాత ఇంటి సభ్యులతో సరదాగా ఎంజాయ్ చేశారు. కంటెస్టెంట్స్ పై పంచ్ లు విసురుతూ తన స్టైల్ లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కనిపించిన కాసేపు ఓంకార్ హోస్ట్‌గా కూడా చేసి ఆకట్టుకున్నాడు. మొత్తానికి హోలీ ఎపిసోడ్ ని గ్రాండ్ గానే ప్లాన్ చేసింది బిగ్‌బాస్ టీం.