Telugu » Latest News
‘ద ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)’ నిబంధనలు ఉల్లంఘించి విదేశాల నుంచి నిధుల సేకరణ, దుర్వినియోగం వంటి చర్యలకు పాల్పడ్డందుకుగాను ఈడీ జరిమానా విధించింది. అక్రమాలకు పాల్పడ్డందుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో చెరువులు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.
వరద తాకిడికి వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతమంది గల్లంతయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి సమయంలో అక్కడే దాదాపు 12 వేల మంది ఉన్నారు. సాయంత్రం 5.30 నుంచి బీభత్సంగా వర్షం కురుస్తోంది.
తమిళనాడులోని తేని జిల్లా, అండిపట్టి ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి తలెత్తింది. కొద్ది రోజులుగా విద్యార్థుల్లో జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలు ఉండటంతో పాఠశాల నిర్వాహకులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు.
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్’ను ఎట్టకేలకు దృశ్యకావ్యంగా మలుస్తున్నాడు. ఇప్పటికే తొలిభాగం సినిమా షూటింగ్ పూర్తి.....
మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
నిరుద్యోగులు, గృహిణులే వారి టార్గెట్. ఇంట్లో ఉంటూనే నెలకు లక్షలు సంపాదించొచ్చని నమ్మించారు. ఉపాధి, ఆదాయం పేరుతో లక్షలు వసూలు చేశారు. కట్ చేస్తే.. కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు.
విస్సన్నపేట శివారు రంగబోలు గెడ్డ, పడమటమ్మ లోవ ప్రాంతాల్లోనే కొంతకాలంగా పెద్ద పులి సంచరిస్తోంది. ఇటీవల ఒక దూడను పులి సగం తిని వదిలేసింది. ఆ లేగదూడ కళేబరాన్ని తినడానికి గురువారం రాత్రి మళ్లీ పులి వచ్చినట్లు తెలిసింది.
పులివెందులలో కూడా జగన్ పరదాలు కట్టుకుని తిరిగారని ఎద్దేవా చేశారు. సొంత జిల్లాలోనూ బారికేడ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పెట్రోల్, వంట గ్యాస్ పై ప్రభుత్వ బాదుడే బాదుడు అని పేర్కొన్నారు.
పార్టీ గుర్తు విషయంలో చర్చ జరుగుతోంది. చట్ట ప్రకారం పార్టీ గుర్తును ఎవరూ తీసుకెళ్లలేరు. అది శివసేనతోనే ఉంటుంది. ఈ విషయంలో ఆందోళన అక్కర్లేదు. న్యాయ నిపుణులను కలిసిన తర్వాతే ఈ మాట చెబుతున్నాను అని వివరించారు.