Taliban victory in Afghanistan: అఫ్ఘాన్లపై తాలిబాన్ల విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న పాకిస్తానీలు

యావత్ ప్రపంచమంతా అఫ్ఘాన్ లో తాలిబాన్ల విజయాన్ని చూసింది. ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీనీ పారిపోయేలా చేసి అధికారం చేజిక్కించుకున్నారు. ఆ దేశస్థులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ..

Taliban victory in Afghanistan: అఫ్ఘాన్లపై తాలిబాన్ల విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న పాకిస్తానీలు

Taliban Sweets

Taliban victory in Afghanistan: యావత్ ప్రపంచమంతా అఫ్ఘాన్ లో తాలిబాన్ల విజయాన్ని చూసింది. ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీనీ పారిపోయేలా చేసి అధికారం చేజిక్కించుకున్నారు. ఆ దేశస్థులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తుంటే.. దానిని గొప్ప విషయంగా భావిస్తూ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు కొందరు పాకిస్తానీలు.

పలు ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్స్ స్వీట్స్ పంచుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఇది అమెరికా ఫెయిల్యూర్ అంటూ చెప్పుకుంటున్నారు నెటిజన్లు.

‘అఫ్ఘానిస్తాన్ ప్రస్తుతం అధికారాన్ని పద్ధతిగా ఘనీ ప్రభుత్వం నుంచి మార్చాల్సి ఉంది’ అని పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ స్పెషల్ అసిస్టెంట్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే అఫ్ఘానిస్తాన్ అంశంలో ఇస్లామాబాద్ రోల్ ఉందంటూ పలు దేశాలు ఆరోపించిన తర్వాతే ఈ ప్రకటన వెలువడింది.

ఇటీవలే బెర్లిన్ లో 300 మంది కలిసి అఫ్ఘానిస్తాన్ తాలిబాన్లకు సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. సదరన్ ఆస్ట్రేలియాలో ఉంటున్న అడిలైడ్ వాసులు సైతం ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనను ముగించాలని అఫ్ఘనిస్తాన్ ఇంటర్నల్ ఎఫైర్స్ కు పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్ఫిరెన్స్ ఆపేయాలంటూ డిమాండ్ చేశారు.

అఫ్ఘాన్లో తాలిబాన్లు దాడి చేయడానికి, అధికారం చేజిక్కించుకోవడానికి వెనుక ఇస్లామాబాద్ నుంచి సపోర్ట్ ఉండొచ్చని అఫ్ఘాన్ వాసులు, నిపుణులు అభిప్రాయపడుతుననారు. ఇస్లామాబాద్ అన్ని టెర్రర్ గ్రూపులకు సహకారం అందిస్తుందనే ప్రచారం ఉండనే ఉంది.