Govt Teacher: పది కూడా పాస్ అవని పప్పూ.. పదేళ్లుగా ప్రభుత్వ టీచర్

ఫేక్ సర్టిఫికేట్లతో పలు డిపార్ట్‌మెంట్లలో ప్రభుత్వఉద్యోగాలు వెలగబెట్టిన ఫేక్ క్యాండిడేట్లను చూశాం. ఏకంగా చదువు చెప్పే టీచర్ పోస్టుకే ఫేక్ సర్టిఫికేట్లతో రెడీ అయిపోయాడు బీహార్ పప్పూ

Govt Teacher: పది కూడా పాస్ అవని పప్పూ.. పదేళ్లుగా ప్రభుత్వ టీచర్

10th Fail

Govt Teacher: ఫేక్ సర్టిఫికేట్లతో పలు డిపార్ట్‌మెంట్లలో ప్రభుత్వ ఉద్యోగాలు వెలగబెట్టిన ఫేక్ క్యాండిడేట్లను చూశాం. కానీ, ఏకంగా చదువు చెప్పే టీచర్ పోస్టుకే ఫేక్ సర్టిఫికేట్లతో రెడీ అయిపోయాడు బీహార్ కు చెందిన పప్పూ. ఒకటి కాదు రెండు కాదు పదేళ్లుగా ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ తో నడిపించేస్తున్నాడు.

విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం విధుల్లో నుంచి తప్పిస్తూ అధికారులకు సమాచారం ఇచ్చింది. డీఎస్పీ మిథిలేష్ కుమార్ జైస్వాల్ నేతృత్వంలో పప్పూ మందాల్‌పై కేసు నమోదు అయింది. అప్పటి నుంచి సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడు.

2012లో టీచర్ గా అపాయింట్ అయిన పప్పూను ఫేక్ సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి చెక్ పెట్టే దిశగా చేసిన విచారణలో పట్టుకున్నారు. పప్పూ మందాల్ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ ప్లానింగ్ యూనిట్ కు వెరిఫికేషన్ కోసం అప్పగించారు. నిజానికి అతను రాసిన పరీక్షల్లో 335మార్కులు వచ్చినట్లు ప్రింట్ చేయించింది ఫేక్.

ఇది కూడా చదవండి : ‘మావయ్య గారు’ అంటూ తారక్ ట్వీట్..

తప్పుగా ప్రింట్ చేయించి ఫేక్ సర్టిఫికేట్ సృష్టించాడు. అతనికి వచ్చిన మార్కులు 285మాత్రమే. పైగా అతను ఫెయిల్ అయినట్లు కూడా సర్టిఫికేట్ లో పేర్కొన్నారు.