Pawan Kalyan : మరోసారి పాట పాడబోతున్న పవర్‌స్టార్..!

ఈ క్రేజీ రీమేక్‌లో పవన్ పాడబోతున్నది ఫోక్ సాంగ్ అని, సినిమాలో ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడల్లా పవన్ పాడిన ఈ పాట బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుంటుందని వార్తలు వస్తున్నాయి..

Pawan Kalyan : మరోసారి పాట పాడబోతున్న పవర్‌స్టార్..!

Pawan Kalyan Sing A Song For Ayyappanum Koshiyum Telugu Remake

Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా.. మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రొడక్షన్ నెం : 12 గా ఈ సినిమాను రూపొందిస్తుంది.

ఇప్పటికే కొంత పార్ట్ షూటింగ్ జరిగింది. పవన్ పోలీస్ పాత్రలో నటిస్తుండగా, రానా హవాల్దార్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమా కోసం తన మార్క్ డైలాగ్స్‌తో పాటు స్క్రీన్‌ప్లే కూడా రాస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ మరోసారి తన గొంతుతో పాట పాడబోతున్నారట. అయితే ఈ సాంగ్ సినిమా అంతా ఉంటుందని అంటున్నారు. ఈ క్రేజీ రీమేక్‌లో పవన్ పాడబోతున్నది ఫోక్ సాంగ్ అని, సినిమాలో ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడల్లా పవన్ పాడిన ఈ పాట బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుంటుందని వార్తలు వస్తున్నాయి.