Ponnaganti kura : పోషకాల పొన్నగంటి కూర ! బరువు తగ్గేలా చేయటంతోపాటు చెడు కొలెస్ట్రాల్ ను దరిచేరనివ్వదు

దీనిలో ఉండే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి.

Ponnaganti kura : పోషకాల పొన్నగంటి కూర ! బరువు తగ్గేలా చేయటంతోపాటు చెడు కొలెస్ట్రాల్ ను దరిచేరనివ్వదు

fennel curry

Ponnaganti kura : ఆకు కూరల్లో పొన్నగంటి కూర అనేక పోషక విలువలు కలిగి ఉంది. దీనిని వేపుడు కూరగా, పప్పులోను వేసుకుని ఆహారంగా తీసుకుంటారు. మంచి రుచిని ఇవ్వటం వల్ల చాలా మంది దీనిని అమిత ఇష్టంగా తింటారు. పొలాల్లో గట్ల వెంట విరివిగా లభిస్తుంది. మార్కెట్లో చాలా చౌకగా కూడా దొరుకుతుంది. ఆకు కూరలన్నింటిలో కెల్ల పొన్నగంటి కూరను ఆహారంలో తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి. అయితే చాలా మంది ఈ ప్రయోజనాలు తెలియక దీనిని తినేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. వాస్తవానికి ఆరోగ్యానికి మేలు కలిగించే అన్ని ప్రయోజనాలు దీని ద్వారా మన శరీరానికి లభిస్తాయి. పొన్నగంటి కూరను వారంలో కనీసం రెండు సార్లు ఆహారంలో చేర్చుకున్నా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

పొన్నగంటి కూరతో ఆరోగ్య ప్రయోజనాలు ;

1.పొన్నగంటి కూరని తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిజంగా జీర్ణక్రియని మెరుగుపరచడానికి ఇది ఔషధంలా పని చేస్తుంది ఆయుర్వేద ఔషధాలలో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

2. రక్తం గడ్డకట్టడాన్ని మెరుగుపరుస్తుంది. ఈ కూరగాయను రక్తహీనతతో బాధపడేవారు రోజూ తినాలి. ఇది మీ రక్తహీనత నుండి బయటపడటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది.

3. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి.

4. దీనిలో ఉండే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి.

5.పొన్నగంటి కూరలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రతిరోజూ కంప్యూటర్‌లో పనిచేసే వారికి ఈ కూర చాలా బాగుంది. ఇది మీ కళ్ళను రక్షించగలదు. కంటి చూపు రెట్టింపు అవుతుంది.

6. పురుషులకు తగినంత వీర్య కణాలు లేకపోతే పిల్లలు పుట్టే అవకాశం తక్కువ. అయితే పొన్నగంటి ఆకును ను ప్రతిరోజూ తింటే వీర్య కణాల లో లోపం తగ్గుతుంది. వీర్య కణాల నాణ్యత మెరుగ్గా ఉంటుంది.

7.పొన్నగంటి కూరలో ప్రొటీన్లు ఎక్కువ. పొన్నగంటి కూరలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి, మాంసం తినలేని వారికి ఇది గొప్ప ఎంపికగా చెప్పవచ్చు.