Pooja Hegde-Rashmika: నువ్వా.. నేనా.. ఏ ఇండస్ట్రీలో చూసినా ఈ ఇద్దరే!

తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేదు. పెద్ద హీరోలా.. చిన్న హీరోలా అన్న డిఫరెన్స్ లేదు. సీనియర్లా, జూనియర్లా అన్న వేరియేషన్ లేదు. ఏ ఇండస్ట్రీ చూసినా, ఏ హీరో పక్కన చూసినా.. ఏ సీజన్..

Pooja Hegde-Rashmika: నువ్వా.. నేనా.. ఏ ఇండస్ట్రీలో చూసినా ఈ ఇద్దరే!

Pooj Hegde Rashmika

Pooja Hegde-Rashmika: తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేదు. పెద్ద హీరోలా.. చిన్న హీరోలా అన్న డిఫరెన్స్ లేదు. సీనియర్లా, జూనియర్లా అన్న వేరియేషన్ లేదు. ఏ ఇండస్ట్రీ చూసినా, ఏ హీరో పక్కన చూసినా.. ఏ సీజన్ లో చూసినా ఈ ఇద్దరి సినిమాలే. 4,5 సినిమాలు చేసి మాయమైపోతున్నఈ జనరేషన్ హీరోయిన్లలో ఇద్దరు హీరోయిన్లు.. 12 సినిమాలతో యమా బిజీగా ఉన్నారు. మరి ఆ ఇద్దరు ముద్దుగుమ్మలెమ్మరో, ఆ సినిమాలేంటో, ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉందో చూద్దాం.

Pooja Hegde: పూజా స్పీడుకు రాధేశ్యామ్ బ్రేకులు!

నువ్వా నేనా అన్నట్టు హవా చాటుతున్నారు పూజా హెగ్డే, రష్మికా. స్టార్స్ సినిమాలు సెట్స్ పైకెళ్తున్నాయంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు ఫిక్స్ కావాల్సిందే అన్నట్టు దూకుడు చూపిస్తున్నారు. స్టార్ హీరోలే కాదు.. యంగ్ హీరోలతో కూడా జత కడుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. జనరల్ గా సౌత్ లో ఉంటే నార్త్ ని పట్టించుకోకుండా.. నార్త్ లో ఉంటే సౌత్ ఇండస్ట్రీని లైట్ తీసుకుంటారు హీరోయిన్లు. కానీ రష్మిక, పూజాహెగ్డే మాత్రం.. ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా సౌత్ టూ నార్త్ 12 సినిమాలు చేస్తూ ఇండియా మొత్తం తిరిగేస్తున్నారు.

Pooja Hegde : ప్రభాస్‌కు నాకు ఎలాంటి గొడవ జరగలేదు.. అవన్నీ వట్టి పుకార్లే..

సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన పూజాహెగ్డే అకౌంట్ లో ఉన్న వన్నీ స్టార్ హీరోల సినిమాలే. తెలుగు నుంచి బాలీవుడ్ వరకూ పూజా 6 సినిమాలు చేస్తోంది. పూజా చేస్తున్న సినిమాలన్నీ రిపీట్ కాంబినేషన్సే. ఏరి కోరి మరీ రెండో సారి, మూడోసారి పూజానే కావాలంటున్నారు అటు హీరోలతో పాటు డైరెక్టర్లు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో.. మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ లాంటి టాప్ హీరోలందరితో బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలు చేసేస్తోంది. ప్రజెంట్ పూజాహెగ్డే.. తెలుగులో రామ్ చరణ్ తో ఆచార్య సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.

Pooja Hegde : ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి జంటగా పూజాహెగ్డే, నాగ చైతన్య ?

తెలుగులో ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటిస్తున్న పూజాహెగ్డే.. హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా చేసే చాన్స్ కొట్టేసింది. అంతేకాదు.. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో త్వరలోనే సినిమా స్టార్ట్ చెయ్యబోతోంది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూనే తమిళ్ లో స్టార్ హీరో విజయ్ తో స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ బీస్ట్ మూవీ చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా వచ్చే వారం రిలీజ్ అవుతున్న బీస్ట్ పాటలతో విజయ్ తో కెమిస్ట్రీని సూపర్బ్ గా పండించింది.

Pooja Hegde : ప్రభాస్‌తో కలిసి ‘బాహుబలి 3’లో నటించాలనుంది

ఒక పక్క తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీ సినిమాలతో కెరీర్ బెస్ట్ టైమ్ ని ఎంజాయ్ చేస్తోంది పూజాహెగ్డే. సౌత్ లో ఇన్ని సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్న పూజాహెగ్డే.. అటు బాలీవుడ్ ని కూడా మేనేజ్ చేస్తోంది. మొన్నటి వరకూ వన్ ఆఫ్ ద హీరోయిన్ రోల్స్ చేసిన పూజాహెగ్డే ఇప్పుడు బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో సర్కస్ మూవీ కంప్లీట్ చేసేసింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దివాళి మూవీ మీద ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నానంటోంది పూజా.

Rashmika Mandanna: బ్రేకప్‌తో బిగ్గెస్ట్ సక్సెస్‌లు అందుకుంటున్న కన్నడ కస్తూరి!

పూజా సంగతలా ఉంటే రష్మిక నేనేం తక్కువ తినలేదంటోంది. నేషన్ వైడ్ ఫాలోవర్స్ ను అకౌంట్ లో వేసుకుని సరిలేరు నాకెవ్వరు అంటోంది రష్మిక. ఒక్కసారిగా సమంతా, పూజా హెగ్డేలను వెనక్కి నెట్టేసి మరీ ఇటు సౌత్ లో అటు నార్త్ లో అవకాశాలు దక్కించుకుంటోంది. పుష్ప 2 ప్రాజెక్ట్ చేతిలో పెట్టుకుని.. మరో 2 తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మొత్తం 6 సినిమాల్ని లైన్లో పెట్టేసింది.

Rashmika Mandanna: సౌత్ టూ నార్త్ బిజీ బిజీ.. సిటీకో ఇల్లు కొనేసిన రష్మిక!

మహేష్ లాంటి స్టార్ హీరోలతో పాటు.. శర్వానంద్, నితిన్ లాంటి యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేసిన రష్మిక లేటెస్ట్ గా హనురాఘవ పూడి-దుల్కర్ సల్మాన్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. వీటితో పాటు లేటెస్ట్ గా తన ఫేవరెట్ తమిళ్ హీరో అయిన విజయ్ తో సినిమా మొదలుపెట్టేసింది.

Rashmika Mandanna : బర్త్‌డే స్పెషల్.. దుల్కర్‌తో రష్మిక.. యుద్ధంతో రాసిన ప్రేమకథ..

తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్నా కూడా బాలీవుడ్ మీద గట్టిగానే కాన్సన్ ట్రేట్ చేసింది. అందుకే బ్యాక్ టూ బ్యాక్ 3 సినిమాలు లైన్లో పెట్టేసింది. సిద్దార్ద్ మల్హోత్రాతో మిషన్ మజ్ను కంప్లీట్ కాకుండానే అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై స్టార్ట్ చేసింది. ఈ సినిమా కంప్లీట్ అయ్యిందో లేదో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న యానిమల్ మూవీ లో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఇలా చెరో 6 సినిమాలతో సౌత్ టూ నార్త్ సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు పూజా, రష్మిక.