Pooja Hegde: పూజా స్పీడుకు రాధేశ్యామ్ బ్రేకులు!

పూజా హెగ్డే.. అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్ బ్యూటీగా మారిపోయింది.

Pooja Hegde: పూజా స్పీడుకు రాధేశ్యామ్ బ్రేకులు!

Pooja Hedge Gets Trolled By Prabhas Fans

Pooja Hegde: పూజా హెగ్డే.. అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్ బ్యూటీగా మారిపోయింది. వరుసగా సినిమాలు చేయడమే కాకుండా అవి సూపర్ హిట్లుగా మారుతుండటంతో పూజా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఇక వరుస హిట్లు వచ్చి పడుతుండటంతో అటు పూజా కూడా తన గుడ్ టైమ్ నడుస్తుందని భావించి, వచ్చిన ప్రతి సినిమాను చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ తన దూకుడును ప్రదర్శిస్తుంది.

Pooja Hegde : ‘రాధేశ్యామ్’ రిజల్ట్ ఎలా ఉన్నా.. అంటూ పూజాహెగ్డే ట్వీట్

అయితే అమ్మడు తనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు భారీగా రెమ్యునరేషన్ పెంచేసి పలుమార్లు విమర్శల పాలయ్యింది. ఇదంతా పక్కనబెడితే, ఇప్పుడు ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’తో పూజా మనముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాధేశ్యామ్ గురించి ఓ రేంజ్‌లో గొప్పలు చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.

కానీ సినిమా రిలీజ్ అయ్యి నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పూజా హెగ్డేను ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రంలో పూజా హెగ్డే లుక్స్ పైనే ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. రాధేశ్యామ్ లాంటి క్లాసిక్ రొమాంటిక్ పాన్ ఇండియా మూవీలో ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే లుక్స్ దారుణంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Pooja Hegde : ప్రభాస్‌కు నాకు ఎలాంటి గొడవ జరగలేదు.. అవన్నీ వట్టి పుకార్లే..

సినిమా కోసం కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం కాదు, చేసే సినిమాలో తన లుక్స్‌ను జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలంటూ పూజాకు సోషల్ మీడియాలో మెసేజ్‌లు చేస్తున్నారు. ఏదైనా ఒక భాషకు చెందిన సినిమా అయితే పర్లేదు కానీ, ఇలా తొలిసారి పాన్ ఇండియా కోసం నటించిన పూజా, ఇలాంటి లుక్స్‌తో కనిపించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్‌కు నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమా ఫెయిల్యూర్‌లో ఖచ్చితంగా పూజా పాత్ర కూడా ఒకటని వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తన సినిమాలపై పూర్తిగా ఫోకస్ పెట్టాలని, కేవలం గ్లామర్ డోస్‌తో నెట్టుకురావాలని చూస్తే, ఇలాంటి రిజల్ట్ తప్పదని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి పూజా ఈ కామెంట్స్‌పై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.