Potti Veeraiah : హాస్యనటుడు పొట్టి వీరయ్య ఇకలేరు..
పలు తెలుగు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ హాస్యనటుడు పొట్టి వీరయ్య ఆదివారం కన్నుమూశారు.. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరయ్యకు ఈరోజు ఉదయం గుండె పోటు రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు..

Potti Veeraiah
Potti Veeraiah: పలు తెలుగు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ హాస్యనటుడు పొట్టి వీరయ్య ఆదివారం కన్నుమూశారు.. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరయ్యకు ఈరోజు ఉదయం గుండె పోటు రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.
సాయంత్రం 4.33 నిమిషాలకు వీరయ్య మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.. రేపు మహా ప్రస్థానంలో వీరయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 500కుపైగా చిత్రాల్లో నటించారాయన.
నల్గొండ జిల్లా, తిరుమలగిరి తాలూకా ఫణిగిరి గ్రామంలో గట్టు నరసమ్మ, గట్టు సింహాద్రయ్య దంపతులకు జన్మించారు వీరయ్య.. వీరికి వీరయ్య రెండో సంతానం. ఆయనకు ఒక అక్క ఉన్నారు..
తమ గ్రామానికి చెందిన మంగళ్ గోపాల్ అనే వ్యక్తి సినిమాల్లో పెళ్లిళ్లకు డెకరేషన్ చేస్తుండేవాడు.. ఆయన సాయంతో 1967లో మద్రాస్‌లో అడుగుపెట్టారు వీరయ్య.. అక్కడ ఓ పూల కొట్టులో పనిచేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారు.
‘జానపద బ్రహ్మ’ విఠలాచార్య, ఎన్టీఆర్‌తో చేసిన ‘అగ్గివీరుడు’ చిత్రం ద్వారా నటుడిగా వీరయ్య ప్రస్థానం ప్రారంభమైంది..‘దర్శకరత్న’ దాసరి, వీరయ్యను బాగా ప్రోత్సహించారు. ఆయన తొలి చిత్రం ‘తాత మనవడు’ లో కీలకపాత్ర ఇచ్చారు. వీరయ్య మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు..