10TV Grama Swarajyam : మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవాలి- 10టీవీ సర్పంచ్‌ల సమ్మేళనంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
పిల్లలకు ఎన్ని భూములు, బిల్డింగ్ లు ఇచ్చినా ప్రయోజనం ఉండదు. వారికి మంచి చదువు చెప్పించాలి. అదే నిజమైన ఆస్తి.
10TV Grama Swarajyam : 10టీవీ గ్రామ స్వరాజ్యం.. ‘సర్పంచ్‌ల సమ్మేళనం-2025’ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొని మాట్లాడారు. కొత్త సర్పంచ్ లకు ఆయన కీలక సూచనలు చేశారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలని కొత్త సర్పంచ్ కు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్సీ కొమరయ్య.
”మీరు చాలా సమస్యలు చెప్పారు. మీ సమస్యలను ఎవరో వచ్చి పరిష్కరించరు. మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవాలి. లోకల్ నాయకులను, అడ్మినిస్ట్రేషన్ ను ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. మీ ఏరియాలో ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు ఉంటే.. వాళ్లని రిక్వెస్ట్ చేసి సీఎస్ఆర్ నిధులు కొంత కలెక్ట్ చేయాలి. లేదా డొనేషన్ విధానంలో ఫండ్ కలెక్ట్ చేయాలి. కార్పస్ ఫండ్ పెట్టుకుంటే ఆ నిధులు పనికొస్తాయి. కేంద్ర పథకాలను మీరు సద్వినియోగం చేసుకోండి. సర్పంచ్ లంతా ఐక్యంగా ఉండాలి. గ్రామాన్ని ఒక కుటుంబం లాగా ఎక్స్ టెండ్ చేసుకోవాలి. డాక్టర్లు, టీచర్లు ఇలా ఒక్కో రంగం నుంచి ఒక్కొక్కరిని తీసుకుని కమిటీలు వేసి వారితో కలిసి పని చేయాలి. అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని పెద్దలను సలహాదారులుగా పెట్టుకోవాలి” అని కొత్త సర్పంచ్ లకు సూచించారు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య.
”మీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, కలెక్టర్ సపోర్ట్ తో మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలి. మీరు అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవాలి. అందులో మా లాంటి పెద్దలను సలహాదారులుగా పెట్టుకోండి. ఏం చేయాలి అనే దాని గురించి మేము మీకు సలహాలు ఇస్తాం. మీ సమస్యలు మీరే కొట్లాడి సాధించుకోవాలి. మీరు చేసే పనులు చాలా ఉన్నాయి. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే. వాళ్లకు మంచి చదువు చెప్పిస్తే సొంతంగా బతకగలుగుతారు. అదే వారికి పెద్ద ఆస్తి. పిల్లలకు ఎన్ని భూములు, బిల్డింగ్ లు ఇచ్చినా ప్రయోజనం ఉండదు. వారికి మంచి చదువు చెప్పించాలి. టీచర్లు స్కూల్ కి వస్తున్నారా లేదా.. పిల్లలకు విద్య చెబుతున్నారా లేదా అనేది మీరే మానిటర్ చేయాలి” అని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సూచించారు.
