LIC Bima Kavach Plan : ఎల్ఐసీ అద్భుతమైన స్కీమ్.. ఈ బీమా కవచ్ ప్లాన్‌తో.. 100ఏళ్ల వరకు ఫుల్ ప్రొటెక్షన్.. ఎవరు అర్హులంటే?
LIC Bima Kavach Plan : ఎల్ఐసీలో బీమా కవచ్ ప్లాన్ తీసుకోండి. కష్ట కాలంలో మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. 100ఏళ్ల వరకు ఫుల్ కవరేజీని అందిస్తుంది.
LIC Bima Kavach Plan
LIC Bima Kavach Plan : మధ్యతరగతివారికి అద్భుతమైన న్యూస్.. ఎల్ఐసీలో మీకు పాలసీ ఉందా? లేదంటే ఇప్పుడే తీసుకోవడం బెటర్.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మధ్యతరగతి వారికోసం “బీమా కవచ్” స్కీమ్ ప్రారంభించింది.
భవిష్యత్తులో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రాథమికంగా లక్ష్యంగా చెప్పవచ్చు. కస్టమర్లు తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీని పొందవచ్చు. మీరు ఏజెంట్ ద్వారా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈజీగా పాలసీని తీసుకోవచ్చు.
ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఇలా ఎంచుకోండి :
ఈ స్కీమ్ ముఖ్య ఫీచర్లలో ఇన్సూరెన్స్ మొత్తం ఆప్షన్లు ఉన్నాయి. కస్టమర్లు తమ అవసరాలను బట్టి ఫిక్స్‌డ్ ఇన్సూరెన్స్ మొత్తం లేదా పెరుగుతున్న బీమా మొత్తం మధ్య ఎంచుకోవచ్చు. కాలక్రమేణా పాలసీదారుల బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి పెరుగుతున్న బీమా మొత్తం ఎంపిక అనేది మీ భవిష్యత్తు అవసరాలకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
100 ఏళ్ల వరకు ప్రొటెక్షన్, ఈజీ ప్రీమియం ఆప్షన్లు :
ఈ ఎల్ఐసీ ప్లాన్ లాంగ్ లైఫ్ ప్రొటెక్షన్ కోరుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. 100 ఏళ్ల వయస్సు వరకు లైఫ్ టైమ్ రిస్క్ కవర్‌ను అందిస్తుంది. కంపెనీ సౌకర్యవంతమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లను కూడా అందిస్తుంది. మీరు సింగిల్ ప్రీమియంను క్రమం తప్పకుండా లేదా 5, 10 లేదా 15 ఏళ్ల లిమిటెడ్ టైమ్ చెల్లించవచ్చు.
స్కీమ్ ప్రొటెక్షన్ ఇలా :
వివాహం లేదా పిల్లల పుట్టడం వంటి ముఖ్యమైన సమయాల్లో ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ఎల్ఐసీలో స్పెషల్ ఆప్షన్ కూడా ఉంది. అయితే, ఈ “లైఫ్ స్టేజ్ ఈవెంట్” ఆప్షన్ 40 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా, ఈ ఫీచర్ సాధారణ ప్రీమియంలతో కూడిన “ఈక్వల్ సమ్ అసూర్డ్” ఆప్షన్ మాత్రమే వర్తిస్తుంది.
అర్హతలేంటి? :
1. ఏ భారతీయ పౌరుడైనా ఈ ప్లాన్ నుంచి బెనిఫిట్ పొందవచ్చు.
2. బీమా కవరేజ్ నుంచి ప్రయోజనం పొందాలంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. ముందుగా వైద్య పరీక్ష అవసరం.
3. కస్టమర్ స్మోకింగ్ చేయని వారైతే తక్కువ ప్రీమియంతో అధిక బెనిఫిట్ పొందుతారు.
4. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తులు ఈ ప్లాన్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
ఈ స్కీమ్ ఎలా పొందాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? :
ఈ ప్లాన్ వివరాల కోసం మీరు LIC వెబ్‌సైట్ (www.licindia.in) లేదా మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చు. మీరు వాట్సాప్ నంబర్ 8976862090 ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఐఆర్‌డీఏఐ పాలసీలను విక్రయించడం లేదా బోనస్‌ల కోసం ఎప్పుడూ కాల్ చేయదని ఎల్ఐసీ కస్టమర్లను హెచ్చరించింది. మీకు ఇలాంటి మోసపూరిత కాల్‌లు వస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
