Prithviraj Sukumaran : భవిష్యత్తులో రీమేక్ సినిమాలు ఉండవు.. చిరంజీవి గారు నన్నే చేయమన్నారు కానీ..

పృద్విరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. ''నా సినిమాలు కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవ్వాలి అనుకున్నాను. అది ‘కడువా’ సినిమాతోనే మొదలుపెట్టాను. భవిష్యత్‌లో రీమేక్‌ సినిమాల సంఖ్య.............

Prithviraj Sukumaran : భవిష్యత్తులో రీమేక్ సినిమాలు ఉండవు.. చిరంజీవి గారు నన్నే చేయమన్నారు కానీ..
ad

Prithviraj Sukumaran :  మలయాళ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకి దగ్గరవుతున్నారు. తెలుగు సినిమాల్లో భాగమవుతున్నారు. మరో పక్క ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది. తాజాగా కడువా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. పృద్విరాజ్ సుకుమారన్ కి ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. కడువా సినిమా జూన్ 30న థియేటర్లలో విడుదల అవ్వనుంది.

ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ప్రమోషన్ చేయడానికి శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో పృద్విరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. ”నా సినిమాలు కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవ్వాలి అనుకున్నాను. అది ‘కడువా’ సినిమాతోనే మొదలుపెట్టాను. భవిష్యత్‌లో రీమేక్‌ సినిమాల సంఖ్య తగ్గిపోతుంది. అసలు రీమేక్ సినిమాలు ఉండకపోవచ్చు కూడా. ఇప్పుడు ప్రతి పరిశ్రమ నుండి మల్టీ లాంగ్వేజ్‌ సినిమాలని తెరకెక్కిస్తున్నారు. అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. రాజమౌళిగారి ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌’ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మెయిన్‌ స్ట్రీమ్‌గా రిలీజ్‌ అయ్యాయి. ఆయన చూపించిన బాటని మనం ఫాలో అవ్వాలి. ‘కేజీఎఫ్‌ 2’ కూడా అలాగే రిలీజ్ అయింది” అని తెలిపారు.

DJ Tillu: మళ్లీ లొల్లి షురూ చేస్తోన్న డీజే టిల్లు!

మలయాళంలో పృద్విరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన లూసిఫర్ సినిమా తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు. దీనిపై మాట్లాడుతూ.. ”లూసిఫర్‌ సినిమాని చిరంజీవి గారు రీమేక్ చేయడం చాలా హ్యాపీ. ఆ చిత్రాన్ని నేను తెలుగులో చేయాలనుకున్నా ఆయనే నా ఫస్ట్‌ ఆప్షన్‌. తెలుగు రీమేక్‌ కథలో మార్పులు గురించి నాకు తెలీదు. నేను కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ‘లూసిఫర్‌’ రీమేక్‌ నన్నే చేయమని చిరంజీవి అడిగారు. కానీ వేరే సినిమాతో నేను బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాక కుదరలేదు. అంతకు ముందు ‘సైరా నరసింహా రెడ్డి’లో కూడా ఒక పాత్ర చేయమని అడిగారు, అప్పుడు కూడా కుదరలేదు. చిరంజీవిగారితో పని చేయాలని ఉంది. నేను ‘లూసిఫర్‌ 2’ చేస్తున్నాను. ఈ సినిమా తెలుగు రీమేక్‌ అవకాశం వస్తే చిరంజీవి గారితోనే చేస్తాను. భవిష్యత్తులో చిరంజీవి గారితో కచ్చితంగా సినిమా చేస్తాను” అని తెలిపారు.