Rakul Preet Sing : రకుల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదా??

కొంతమంది హీరోయిన్లు తమ అందాన్ని మరింత మెరుగు పరుచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన ఈ సర్జరీలు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలకి పాకాయి.

Rakul Preet Sing : రకుల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదా??

Rakul Preet Singh (image:instagram)

Rakul Preet Sing :  కొంతమంది హీరోయిన్లు తమ అందాన్ని మరింత మెరుగు పరుచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన ఈ సర్జరీలు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలకి పాకాయి. సౌత్ లో కూడా చాలా మంది స్టార్ హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించారు. నయనతార, శ్రుతిహాసన్, సమంత.. ఇలా చాలా మంది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అని వార్తలు వచ్చాయి.

కొన్ని రోజుల క్రితం రకుల్ ఒక ఫోటోషూట్ చేయించింది. ఈ ఫొటోస్ లో కంటే కూడా అంతకు ముందే బాగుంది. వీటిని నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు. ఆ ఫొటోస్ చూసి రకుల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించిందని వార్తలు వచ్చాయి. తన పెదవులకి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించిందని అది సరిగ్గా కుదరక ఇలా తయారయిందని వార్తలు ప్రచారం చేశారు. కానీ వీటిపై రకుల్ స్పందించలేదు.

Online Ticketing : ఆన్లైన్ టికెటింగ్ పై ఏపీ సీఎంకి థ్యాంక్స్ చెప్పిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

తాజాగా రకుల్ ఈ కామెంట్లకి ప్రాక్టికల్ గానే క్లారిటీనిచ్చింది అని అభిమానులు అంటున్నారు. కొండపొలం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రకుల్ ఒరిజినల్ రూపం బయటపడింది. ఈ వేడుకలో ఆమె పెదవులు చాలా సాధారణంగా కనిపించాయి. రకుల్ కూడా ఇదివరకులాగా చాలా అందంగా కనపడింది. దీంతో రకుల్ ప్లాస్టిక్ సర్జరీ చేయలేదని నిర్ధారణకు వస్తున్నారు అభిమానులు. ఆ ఫోటోలు ఫోటో తీయడంలో కానీ, లేదా ఫోటోషాప్ ఫాల్ట్ అయ్యుండొచ్చని ఇప్పుడు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అభిమానులు కొండపొలం ఈవెంట్ లో రకుల్ ఫోటోలను,పాత ఫోటోలను పోల్చి చూస్తున్నారు. మరి సర్జరీ చేపించిందో చేపించలేదో రకుల్ కే తెలియాలి.