రామ్‌తో లింగుస్వామి సినిమా..

రామ్‌తో లింగుస్వామి సినిమా..

Ram Pothineni : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ సంక్రాంతికి ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల తర్వాత కిశోర్ తిరుమల, రామ్ కలయికలో వచ్చిన మూడవ చిత్రమిది.

తాజాగా రామ్ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ‘రన్, పందెంకోడి, ఆవారా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ్ టాప్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ సినిమా చెయ్యబోతున్నాడు.

పవన్ కుమార్ సమర్పణల్, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. ఈ సినిమా కోసం రామ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు.

తెలుగుతో పాటు తమిళ్‌లోనూ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Ram