Realme Pad X India : రియల్‌మి నుంచి Realme Pad X టాబ్లెట్ వస్తోంది.. ఎప్పుడంటే?

Realme Pad X India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్‌మి నుంచి కొత్త టాబ్లెట్ వస్తోంది. భారత మార్కెట్లో ఈ నెలలోనే ఈ Realme Pad X డివైజ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Realme Pad X India : రియల్‌మి నుంచి Realme Pad X టాబ్లెట్ వస్తోంది.. ఎప్పుడంటే?

Realme Pad X India Launch May Happen In June, Here Is What To Expect

Realme Pad X India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్‌మి నుంచి కొత్త టాబ్లెట్ వస్తోంది. భారత మార్కెట్లో ఈ నెలలోనే ఈ Realme Pad X డివైజ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Realme India CEO మాధవ్ షేత్ గత వారమే కంపెనీ ప్రీమియం టాబ్లెట్ లాంచ్ కానున్నట్టు తెలిపారు. కానీ, ఏ నెలలో ఏదో తేదీన రియల్ మి టాబ్లెట్ లాంచ్ అవుతుందో రివీల్ చేయలేదు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో లాంచ్ త్వరలో జరుగుతుందని పేర్కొంది. ఇందులోనూ లాంచ్ తేదీని ధ్రువీకరించలేదు. ఇప్పుడు Realme Pad X లాంచ్ జూన్‌లో ఉంటుందని ఓ కొత్త నివేదిక వెల్లడించింది.

91మొబైల్స్ నివేదించిన ప్రకారం.. రియల్‌మే అత్యంత ప్రీమియం టాబ్లెట్.. రియల్‌మే ప్యాడ్ ఎక్స్‌ (Realme Pad X)ని ఈ నెలాఖరులో రిలీజ్ అయింది. అయితే తేదీ స్పష్టంగా తెలియనప్పటికీ, కొత్త రియల్‌మే టాబ్లెట్ లాంచ్ ఈ నెల మొదటి వారంలో ఉండే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం.. జూన్ 15 లోపు Realme Pad X లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. భారతీయ మోడల్ 4GB, 6GB RAM వేరియంట్‌లలో వస్తుంది. Realme Pad X మూడు కలర్ వేరియంట్‌ల్లో గ్లేసియర్ బ్లూ, రేసింగ్ గ్రీన్, గ్లోయింగ్ గ్రే భారతీయ మార్కెట్‌లలో అందుబాటులో ఉంటాయని నివేదిక పేర్కొంది.

Realme Pad X India Launch May Happen In June, Here Is What To Expect (1)

Realme Pad X India Launch May Happen In June, Here Is What To Expect

Realme Pad X ధర :
Realme Pad X ధర ఇండియాలో ఎంత ఉంటుందో వెల్లడించలేదు. చైనాలో టాబ్లెట్ ధర ఎంత ఉంటుందో దాని ఆధారంగా అంచనా వేయవచ్చు. Realme చైనాలో ప్యాడ్ Xని CNY 1,299 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. దాదాపు రూ. 15,000 వరకు ఉండొచ్చు. అయితే కంపెనీ లైనప్‌లోని వెనిలా టాబ్లెట్ రియల్‌మీ ప్యాడ్ రూ. 13,999 నుంచి అందుబాటులో ఉంటుంది. కంపెనీ Realme Pad X డివైజ్ కొంచెం ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.

Realme Pad X స్పెసిఫికేషన్స్ :
Realme Pad X టాబ్లెట్.. 2K రిజల్యూషన్‌తో 11-అంగుళాల LCDని కలిగి ఉంది, 450nits, DC డిమ్మింగ్‌కు సపోర్టు చేస్తుంది. TUV రైన్‌ల్యాండ్ బ్లూ లైట్ ఫిల్టర్ కూడా ఉంది. స్క్రీన్ 4,096 స్టైలస్ ఇన్‌పుట్‌కు సపోర్టు ఇస్తుంది. Realme Pad Xలో క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. Dolby Atmos, Hi-Res ఆడియోను అందిస్తాయి.

Realme Pad X డివైజ్ ఆక్టా-కోర్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ తో రన్ అవుతుంది. గరిష్టంగా 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. ఈ టాబ్లెట్ వైఫై వెర్షన్‌లో మాత్రమే వస్తుంది. కొత్త టాబ్లెట్ ప్యాడ్ కోసం కొత్త Realme UI 3.0ని అందిస్తోంది. Realme Pad Xలో ఫ్రంట్ కెమెరా 105 డిగ్రీల వ్యూతో వస్తుంది. వెనుకవైపు 13-MP ప్రధాన కెమెరా ఉంది. Realme Pad X 8340mAh బ్యాటరీతో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : Moto E32s : భారీ బ్యాటరీతో Moto E32s కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?