Moto E32s : భారీ బ్యాటరీతో Moto E32s కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Moto E32s : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ Moto E32s నుంచి భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. రూ.10వేల లోపు కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. గత నెలలో యూరప్‌లో లాంచ్ అయింది

Moto E32s : భారీ బ్యాటరీతో Moto E32s కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Moto E32s Launched In India With Mediatek Helio G37 Soc, 5000 Mah Battery

Moto E32s : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ Moto E32s నుంచి భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. రూ.10వేల లోపు కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. గత నెలలో యూరప్‌లో లాంచ్ అయింది. MediaTek చిప్‌సెట్‌తో వచ్చింది. Moto E32s Flipkart, Reliance Digital, JioMart, JioMart డిజిటల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. Moto E32s భారత మార్కెట్లో రూ. 9,299కి రిలీజ్ అయింది. లాంచ్ ఆఫర్‌లో భాగంగాభారత మార్కెట్లో Moto E32s ధర రూ.8,999గా ఉంది. 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీని పొందవచ్చు. 4GB+64GB వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ.9,999గా ఉంటుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ జూన్ 6 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉండనుంది.

Moto E32s స్పెసిఫికేషన్స్ :
Moto E32s PMMA ఎండ్ పాలికార్బోనేట్ బ్యాక్‌తో వస్తుంది. ఫోన్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్‌ ఇచ్చారు. ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల IPS LCDతో వస్తుంది. ఫ్రంట్ కెమెరాలో టాప్ మిడిల్ హోల్-పంచ్ కటౌట్ ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. వెనుకవైపు, Moto E32s ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Moto E32s Launched In India With Mediatek Helio G37 Soc, 5000 Mah Battery (1)

Moto E32s Launched In India With Mediatek Helio G37 Soc, 5000 Mah Battery 

డివైస్‌లో డెప్త్ మ్యాపింగ్, మాక్రో ఫోటోగ్రఫీ కోసం 16MP ప్రధాన కెమెరా సెన్సార్‌తో పాటు రెండు 2MP సెన్సార్లు ఉన్నాయి. ఈ ఫోన్ హోల్-పంచ్ కటౌట్, 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఫోన్ AI ఫేస్ అన్‌లాక్‌తో కూడా వస్తుంది. Motorola డివైజ్‌లో భారీ 5000 mAh బ్యాటరీని అందిస్తుంది.

15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio G37 SoCని కూడా కలిగి ఉంది. గరిష్టంగా 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఈ డివైజ్.. మైక్రో SD స్లాట్ ద్వారా మెమెరీ స్పేస్ పెంచుకోవచ్చు. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి మెమరీని 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ స్లేట్ గ్రే, మిస్టీ సిల్వర్ అనే రెండు కలర్లలో వస్తుంది. ఆండ్రాయిడ్ 12-ఆధారిత MyUXతో రన్ అవుతుంది. ఈ ఫోన్ బరువు 185 గ్రాములు, 8.49mm ఉంటుంది.

Read Also : Instagram AMBER : ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. తప్పిపోయిన పిల్లల ఆచూకీ కనిపెడుతుంది..!