RGV : ‘రాధేశ్యామ్’కి అంత బడ్జెట్ అవసరం లేదు.. ఆర్జీవీ కామెంట్స్..

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. ''రాధేశ్యామ్‌లో హీరో ప్రభాస్‌ పారితోషికం పక్కన పెడితే ఈ సినిమా మొత్తం బడ్జెట్‌లో 5వ వంతు ఖర్చుతో అదే సినిమా అదే కథతో తీయొచ్చు.......

RGV : ‘రాధేశ్యామ్’కి అంత బడ్జెట్ అవసరం లేదు.. ఆర్జీవీ కామెంట్స్..

Rgv

 

Radheshyam :  సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ మన చుట్టూ జరుగుతున్న పలు అంశాలపై మాట్లాడుతూ, ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఇక సినిమాల గురించి అయితే కచ్చితంగా మాట్లాడతారు. ఎప్పుడూ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ లేదా రాముఇజం పేరుతో తన ఛానల్ లోనే పలు అంశాలపై మాట్లాడుతూ ఉంటాడు ఆర్జీవీ. ఇటీవల ప్రభాస్ హీరోగా రిలీజైన ‘రాధేశ్యామ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక కలెక్షన్ల పరంగా అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. గతంలోనే ఆర్జీవీ ‘రాధేశ్యామ్’ సినిమాపై కామెంట్లు చేశారు. తాజాగా మరోసారి ‘రాధేశ్యామ్’ సినిమాపై కామెంట్లు చేశారు ఆర్జీవీ.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. ”రాధేశ్యామ్‌లో హీరో ప్రభాస్‌ పారితోషికం పక్కన పెడితే ఈ సినిమా మొత్తం బడ్జెట్‌లో 5వ వంతు ఖర్చుతో అదే సినిమా అదే కథతో తీయొచ్చు. రాధేశ్యామ్‌ వంటి ఇంటెన్స్‌ లవ్‌స్టోరీకి అభిమానులకు విజువల్‌ ఫీస్ట్‌ అవసరం లేదు. కథలోని భావోద్వేగం, భావాలను విజువల్‌ ఫీస్ట్ డామినేట్ చేస్తాయి. ఇది కథను చంపేస్తుంది. రాధేశ్యామ్‌ మూవీకి పెట్టిన బడ్జెట్‌, వచ్చిన వసూళ్లకు పొంతన లేదు” అని అన్నారు.

RRR : దుబాయ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం సందడి

ఆలాగే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాని ‘రాధేశ్యామ్’తో పోలుస్తూ.. ”బాలీవుడ్‌ చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ గురించి విడుదలయ్యే వరకు ఎవరికి తెలియదు, కేవలం 15 కోట్లతో తెరకెక్కిన ఆ సినిమా ఇప్పుడు 100 కోట్ల వసూళ్లు సాధించింది. ఒక మూవీకి విజువల్‌ ఎఫేక్ట్స్‌ కంటే కథలో ఉండే దమ్ము ముఖ్యమని ఈ రెండు సినిమాలు నిరూపించాయి” అని ఆర్జీవీ తెలిపారు.