Risk of early death for men : షాకింగ్ ఫ్యాక్ట్.. ఆడవారితో పోలిస్తే మగవాళ్లలోనే మరణాల ముప్పు ఎక్కువ

ఓ అధ్యయనంలో షాకింగ్ ఫ్యాక్ట్ బయటపడింది. ఇది మగాళ్లను కాస్త టెన్షన్ పెట్టే వార్తే. మరీ ముఖ్యంగా స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి, గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి.

Risk of early death for men : షాకింగ్ ఫ్యాక్ట్.. ఆడవారితో పోలిస్తే మగవాళ్లలోనే మరణాల ముప్పు ఎక్కువ

Risk Of Early Death For Men

Risk of early death for men: ఓ అధ్యయనంలో షాకింగ్ ఫ్యాక్ట్ బయటపడింది. ఇది మగాళ్లను కాస్త టెన్షన్ పెట్టే వార్తే. మరీ ముఖ్యంగా స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి, గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే మరణాల ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజాగా మరో పరిశోధన వెల్లడించింది. 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో అదే వయసు మహిళలతో పోలిస్తే మరణం ముప్పు దాదాపు 60 శాతం ఎక్కువని తేలింది. స్మోకింగ్, గుండె జబ్బులు వంటి సమస్యలు దీనికి కారణమవుతున్నాయని విశ్లేషించింది. స్త్రీ, పురుష మరణాల్లో వ్యత్యాసం, కారణాలపై ఓ అధ్యయనం జరిగింది. ఆ అధ్యయన నివేదిక కెనడియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

వయసు 50ఏళ్లు పైబడిన రిలో పురుషులు, మహిళల మరణాల మధ్య తేడా ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు లండన్‌ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అధ్యయనంలో భాగంగా, వివిధ దేశాల్లో స్త్రీ పురుషుల్లో సంభవిస్తున్న మరణాల వయసులో వ్యత్యాసం వేరువేరుగా ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు ఆయా దేశాల్లోని సామాజిక, ఆర్థిక, జీవన విధానం వంటి అంశాలు కారణమని లండన్‌లోని కింగ్స్‌ కాలేజీకి చెందిన ప్రొఫెసర్‌ యూ-జూ వూ వెల్లడించారు. వారివారి సంప్రదాయాలు, సామాజిక ఆర్థిక పరిస్థితులు ఆయా దేశాల స్త్రీ, పురుషుల ఆరోగ్యంపై ఎక్కువగానే చూపించే అవకాశం ఉందన్నారు.

28 దేశాల్లోని దాదాపు లక్షా 79వేల మందిపై ఈ అధ్యయనం చేపట్టగా.. వీరిలో 55 శాతం మంది మహిళలే ఉన్నారు. జీవనసరళి, సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యంతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని సమాచారాన్ని విశ్లేషించారు. ఇలా యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో మహిళలతో పోలిస్తే 60 శాతం అధికంగా మరణాలు చోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. స్మోకింగ్ వంటి అలవాట్లు పురుషుల్లో అనారోగ్యానికి కారణమవుతున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా గుండె జబ్బులు కూడా పురుషుల్లో తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య విధానాలు నిర్ణయించే సమయంలో స్త్రీ, పురుషుల ఆరోగ్యం, వారి ఆయుర్దాయంలో తేడాలు, సామాజిక సాంస్కృతిక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవరసం ఎంతైనా ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.