Sailesh Kolanu : అడివిశేష్ తో సినిమా తీయొద్దన్నారు.. కథలో వేలు పెడతాడు అని చెప్పారు..

శైలేష్ కొలను మాట్లాడుతూ.. ''ఈ కథతో శేష్ దగ్గరికి వెళ్లేముందు నాకు చాలా మంది చెప్పారు. శేష్ తో సినిమా వద్దు, శేష్ కథలో, సినిమాలో వేలు పెడతాడు అన్నారు. అన్ని తనే రాసుకుంటాడు అన్నారు. దీంతో శేష్ కి...............

Sailesh Kolanu : అడివిశేష్ తో సినిమా తీయొద్దన్నారు.. కథలో వేలు పెడతాడు అని చెప్పారు..

Sailesh Kolanu speech in Hit 2 teaser launch event

Updated On : November 4, 2022 / 7:13 AM IST

Sailesh Kolanu :  నాని నిర్మాణంలో అడివిశేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్ సెకండ్ కేస్’ రిలీజ్ కి రెడీ అవుతుంది. డిసెంబర్ 2న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజగా గురువారం నాడు ప్రెస్ మీట్ పెట్టి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు శైలేష్ కొలను అడివి శేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అడివి శేష్ తనే కథ రాసుకోగలడు, దర్శకత్వం కూడా చేయగలడు. అడివి శేష్ గత సినిమాల్లో తన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అయితే అడివి శేష్ తీసే సినిమాల్లో, ఆ కథలో అడివి శేష్ వేలు పెడతాడు, మార్పులు, చేర్పులు చేస్తాడు అని టాలీవుడ్ లో టాక్ ఉంది. దీనిపై శైలేష్ మాట్లాడాడు.

KV Anudeep : అరుదైన వ్యాధితో బాధపడుతున్న జాతిరత్నాలు డైరెక్టర్.. కాఫీ, జ్యుస్‌లు పడవంట.. ఆ వ్యాధిపై కూడా సినిమా తీస్తాడట..

శైలేష్ కొలను మాట్లాడుతూ.. ”ఈ కథతో శేష్ దగ్గరికి వెళ్లేముందు నాకు చాలా మంది చెప్పారు. శేష్ తో సినిమా వద్దు, శేష్ కథలో, సినిమాలో వేలు పెడతాడు అన్నారు. అన్ని తనే రాసుకుంటాడు అన్నారు. దీంతో శేష్ కి కథ నచ్చుతుందో, లేదో అనుకుంటూ భయంగానే వెళ్ళాను. కానీ మొదటి సిటింగ్ లోనే కథని ఓకే చేసాడు. కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. డైరెక్టర్ గా నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. సెట్స్ లో చాలా ప్రొఫెషనల్ గా ఉన్నాడు. ఆ హీరో క్యారెక్టర్ ఎలా ఉండాలనుకున్నానో అంతకంటే బాగా చేశాడు. హిట్ వర్స్ కి మంచి ఆదరణ వచ్చింది. దీంతో రాబోయే హిట్ సినిమాలు మరింత గొప్పగా ఉంటాయి” అని తెలిపాడు.