విజయ్ దేవరకొండతో కిస్ చేయాలని ఉంది : తమన్నా..

  • Published By: sekhar ,Published On : December 10, 2020 / 02:02 PM IST
విజయ్ దేవరకొండతో కిస్ చేయాలని ఉంది : తమన్నా..

Sam Jam Episode 4 Glimpse: పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ సమంతతో ఇటీవల ‘సామ్ జామ్’ పేరిట ఓ స్పెషల్ టాక్ షోను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సామ్ పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తోంది. ఇటీవల రానా, నాగ్ అశ్విన్ పార్టిసిపేట్ చేసిన ఎపిసోడ్ ఆకట్టుకుంది.

తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా ఈ షో లో పాల్గొంది. గురువారం గ్లింప్స్ రిలీజ్ చేశారు. ర్యాపిడ్ ఫైర్ అంటూ సామ్, తమన్నాను కొన్ని ప్రశ్నలు అడిగింది.
ఒకవేళ నో కిస్సింగ్ ఆన్ స్క్రీన్ బ్రేక్ రూల్ చేస్తే.. ఎవరితో కిస్ చేయాలనుకుంటున్నావని అడగ్గా.. విజయ్ దేవరకొండతో కిస్ చెయ్యాలని ఉందని చెప్పింది తమన్నా..


అఖిల్ కొంచెం యంగ్ అయిపోయాడు అని సమంత అంటుంటే.. లవ్‌కి ఏజ్‌తో సంబంధం లేదు అంది తమన్నా.. నీక్కావాలంటే అఖిల్‌తో మీటింగ్ అరైంజ్ చేస్తా, వాళ్ల ఫాదర్‌తో కూడా మాట్లాడతావా.. అంటూ తమన్నాని ఆటపట్టించింది సామ్..


తమన్నా ఇప్పుడు సొంతగా స్టంట్స్ చేస్తోంది. ట్రైనింగ్‌లో ఆమెకు హెల్ప్ చేసిన ట్రైనర్స్.. కోమల్, షాలినిలను అభినందిస్తూ చెరో రూ.లక్ష చెక్ అందించారు.. ఇక ప్రోమో చివర్లో దర్శకురాలు నందిని రెడ్డి ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. ‘సామ్ జామ్’ తమన్నా ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 11న ఈ ఎపిస్టోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకాలస్యం.. ప్రోమో చూసెయ్యండి మరి..

Sam Jam

Sam Jam

Sam Jam