Sanjay Raut’s Wife At Enforcement Directorate’s Office: కుమార్తెతో కలిసి ఈడీ ఆఫీసుకు సంజయ్ రౌత్ భార్య
పాత్రా చాల్ కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణీ కేసులో ఇటీవలే సమన్లు అందుకున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ ఇవాళ ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వెళ్ళారు. వర్షా రౌత్‌తో పాటు ఆమె కుమార్తె, సంజయ్ రౌత్ సోదరుడు సానిల్ రౌత్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే సంజయ్ రౌత్‌ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆయన నుంచి పలు వివరాలు రాబట్టారు.

Sanjay Raut's Wife At Enforcement Directorate's Office
Sanjay Raut’s Wife At Enforcement Directorate’s Office: పాత్రా చాల్ కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణీ కేసులో ఇటీవలే సమన్లు అందుకున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ ఇవాళ ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వెళ్ళారు. వర్షా రౌత్‌తో పాటు ఆమె కుమార్తె, సంజయ్ రౌత్ సోదరుడు సానిల్ రౌత్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇటీవల సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులు లెక్కల్లో చూపని రూ.11.50 లక్షలు గుర్తించిన విషయం తెలిసిందే.
సంజయ్ రౌత్‌ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆయన నుంచి పలు వివరాలు రాబట్టారు. అనంతరం సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ అధికారులు సమన్లు పంపారు. ఈ నేపథ్యంలోనే ఆమె నేడు విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా, సంజయ్ రౌత్ ఈడీ కస్టడీని ఆగస్టు 8 వరకు న్యాయస్థానం పొడిగించింది. రేపటితో ఆ గడువు ముగుస్తుంది.
పాత్రా చాల్ కేసులో ఈడీ సమర్థంగా కీలక వివరాలు రాబట్టిందని ఇటీవలే కోర్టు పేర్కొంది. పాత్రా చాల్ భూ కుంభకోణం (రూ.1,000 కోట్లు)కు సంబంధించి ఇప్పటికే సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం విపక్ష పార్టీలకు వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.
Weather update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం