‘సారంగదరియా’.. సాయి పల్లవికి మరో 100 మిలియన్ల సాంగ్..

‘సారంగదరియా’.. సాయి పల్లవికి మరో 100 మిలియన్ల సాంగ్..

sai-pallavi

Saranga Dariya​​: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నబ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరి’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి..
ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. వాలెంటైన్స్ డే కానుకగా ‘నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి’ అనే బ్యూటిఫుల్ సాంగ్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.

Love Story

ఆదివారం సమంత అక్కినేని ‘సారంగదరియా’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. పవన్ ట్యూన్, సుద్దాల అశోక్ తేజ లిరిక్స్, మంగ్లీ వాయిస్ పాటకు ప్లస్ అయితే.. సాయి పల్లవి బ్యూటిఫుల్ మూమెంట్స్, ఆకట్టుకునే హావభావాలతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. సుద్దాల అర్థవంతమైన ఆకట్టుకునే పదాలు అలవోకగా రాసి ఆశ్చర్యపరిచారు. ‘‘దాని నడుం మడతలే మెరియా.. పడిపోతది మొగోళ్ల దునియా.. అది రమ్మంటె రాదుర సెలియా.. దాని పేరే సారంగదరియా’’.. అంటూ సాగే ఈ సాంగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

వరుణ్ తేజ్, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబోలో వచ్చిన ‘ఫిదా’ మూవీలోని ‘వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే..’ పాటంత పాపులర్ అవుతుంది, సాయి పల్లవికి మరో 100 మిలియన్ల సాంగ్ కూడా అవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘లవ్ స్టోరీ’ చిత్రం ఏప్రిల్ 16న విడుదల కానుంది.