Kcr : నేను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? అదో పనికిమాలిన స్కీమ్, ఆడోళ్లు తన్నుకుంటున్నారు- కేసీఆర్

4 నెలలుగా తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోంది.

Kcr : నేను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? అదో పనికిమాలిన స్కీమ్, ఆడోళ్లు తన్నుకుంటున్నారు- కేసీఆర్

Kcr : కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడతానని చెప్పారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ రోడ్ షో లో కేసీఆర్ మాట్లాడారు. 5 నెలల కింద తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెలా ఉందో ప్రజలు గమనించాలని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెప్పపాటు కరెంట్ కట్ లేదు, ఇంటింటికి పరిశుభ్రమైన నీళ్లు అందించాం అని చెప్పారు.అరచేతిలో వైకుంఠం చూపించి.. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. డిసెంబర్ 9న చేస్తానని సీఎం చెప్పిన హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.

”రైతుబంధు, తులం బంగారం ఏమైంది? ఫ్రీ బస్సు స్కీమ్ పనికిమాలిన స్కీమ్. ఆడోళ్లు సిగలు పట్టుకొని తన్నుకుంటున్నారు. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు మాయమయ్యాయి. పల్లెలు, మున్సిపాలిటీలకు నిధులు లేవు. చెన్నూర్ ఎత్తిపోతల పథకం ఆపేశారు. బీఆర్ఎస్ పథకాలు ఆపేయడమే కాదు. కేసీఆర్ ను కనుమరుగు చేస్తా అంటున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలను రద్దు చేస్తా అని సీఎం అంటున్నారు. మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ గెలవాలి. బీఆర్ఎస్ గెలవాలి. సింగరేణి ప్రైవేటీకరణ చేసే కుట్ర సీఎం చేస్తున్నారు.

అహంకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను శిక్షిస్తోంది. కృష్ణా నదిని ఆల్రెడీ అప్పగించేశారు. గోదావరిని మోడీ ఎత్తుకుపోవాలనే కుట్ర జరుగుతోంది. తెలంగాణ హక్కులు కాపాడబడాలి అంటే పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. జైళ్లకు కేసీఆర్ భయపడతాడా? కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? నా ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణను కాపాడతా. దళితబంధు కింద మేము ఇచ్చిన నిధులు ఇప్పటి ప్రభుత్వం తిరిగి తీసుకుంది. 4 నెలలుగా తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోంది. నరేంద్ర మోడీది అంతా గ్యాస్ కంపెనీదే. బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో వేసినట్టే” అని కేసీఆర్ అన్నారు.

Also Read : రేవంత్ సర్కారుని పడగొడతామన్న వారే పడిపోతారు: అసదుద్దీన్ కీలక కామెంట్స్