ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: ఇండియా సూచన

Indian Students In Kyrgyzstan: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా దీనిపై స్పందించారు. రాయబార కార్యాలయంతో..

ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: ఇండియా సూచన

Foreign Minister Jaishankar

కిర్గిజ్‌స్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు జరిగిన తీరు కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ హాస్టల్‌లో జరిగిన మూకదాడుల్లో పలువురు పాకిస్థానీ విద్యార్థులు గాయపడ్డారు. దీంతో కిర్గిజ్‌స్థాన్‌లోని భారత పౌరులు ఇళ్లలోనే ఉండాలని ఇండియా సూచించింది.

తాము భారతీయ విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని కిర్గిజ్‌స్థాన్‌లోని భారత కాన్సులేట్ ఎక్స్ లో పేర్కొంది. అయినప్పటికీ విద్యార్థులు ప్రస్తుతానికి ఇళ్లలోనే ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎంబసీని సంప్రదించాలని సూచించింది.

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా దీనిపై స్పందించారు. రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉండాలని భారత విద్యార్థులకు ఆయన సూచించారు. కాగా, పాకిస్థాన్ విద్యార్థులపై జరిగిన దాడులపై పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ కూడా స్పందించారు.

కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్‌కెక్‌లో పాకిస్థానీ విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఎక్స్ లో పేర్కొన్నారు. అవసరమైన సాయం అందించాలని తాను పాక్ రాయబారిని ఆదేశించానని చెప్పారు. తన కార్యాలయం కూడా ఎంబసీతో టచ్‌లో ఉందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు.

Also Read: భూ వివాదం.. మాజీమంత్రి మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు