పార్లమెంట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీతో ఆసక్తికర భేటీ
లోక్‌సభ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. కొద్దిసేపు సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

CM Revanth Reddy in Parliament
CM Revanth Reddy in Parliament: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పార్లమెంటుకు వచ్చారు. వీక్షకుల గ్యాలరీలో కూర్చొని తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారాన్ని తిలకించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేత జానారెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు గడ్డం వివేక్, జితేందర్‌రెడ్డి
కూడా ఎంపీల ప్రమాణస్వీకారాన్ని వీక్షించారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ కూడా లోక్‌సభ గ్యాలరీ నుంచి రాహుల్ గాంధీ, తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారాన్ని తిలకించారు. వీక్షకుల గ్యాలరీ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. కొద్దిసేపు సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ సభ్యులు.. ఎంపీలుగా ప్రమాణం చేశారు. అసదుద్దీన్ ఓవైసీ.. ఉర్డూలో, గోడెం నగేష్.. హిందీలో ప్రమాణస్వీకారం చేశారు.
సురేష్ షెట్కర్, ఈటల రాజేందర్, డీకే అరుణ, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్.. తెలుగులో ప్రమాణం చేశారు.
Also Read : రంగంలోకి కేసీ వేణుగోపాల్.. రాజీనామాపై వెనక్కి తగ్గిన జీవన్ రెడ్డి.. ఏం హామీ ఇచ్చారంటే?
గడ్డం వంశీ కృష్ణ, ధర్మపురి అరవింద్, రఘునందనరావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, రామసాయం రఘురాంరెడ్డి.. ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. తెలుగులో ఆయన ప్రమాణం చేశారు.