Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ...

Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Price

Gold And Silver Price Today : బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత ఐదు రోజులుగా వరుసగా ధరలు తగ్గుతుండటంతో కనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుధవారంసైతం బంగారం, వెండి ధరలు తగ్గాయి. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 230 తగ్గింది. మరోవైపు వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
    తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,000కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,000.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,150 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,150.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,000 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,000.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,600 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,660.

 

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా బుధవారం వెండి ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 94,500.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండి రూ.94,500.
    కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.90,000.
    బెంగళూరులో మాత్రం కిలో వెండిపై రూ. 100 మాత్రమే తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 90,950 వద్ద కొనసాగుతుంది.

 

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.