Hardik Pandya : ఆసియాకప్‌లో చరిత్ర సృష్టించేందుకు.. 17 పరుగుల దూరంలో హార్దిక్ పాండ్యా
ఆసియాకప్ టీ20 చరిత్రలో చరిత్ర సృష్టించేందుకు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 17 పరుగుల దూరంలో ఉన్నాడు.

Hardik Pandya needs 17 runs to achieve rare all rounder feat in Asia Cup t20 cricket history
Hardik Pandya : యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. 8 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)అరుదైన ఘనత సాధించే అవకాశం ఉంది. అందుకు పాండ్యాకు 17 పరుగులు మాత్రమే అవసరం.
ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా 83 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టాడు. ఇంకో 17 పరుగులు చేస్తే.. ఆసియాకప్ టీ20 చరిత్రలో 100 పరుగులు చేయడంతో పాటు 10 కి పైగా వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
ఇక ఆసియా కప్‌లో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అటు బ్యాట్‌తో ఇటు బంతిలో అతడు రాణిస్తే భారత్‌కు ఈ మెగాటోర్నీలో తిరుగు ఉండదు.
ఆసియాకప్‌లో భారత షెడ్యూల్ ఇదే..
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు ఆసియాకప్ 2025లో బరిలోకి దిగనుంది. ఈమెగాటోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో ఆడనుంది. ఆ తరువాత చిరకాల ప్రత్యర్థి పాక్‌తో సెప్టెంబర్ 14 తలపడనుంది. లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది. ఆ తరువాత సూపర్ 4 దశ మొదలుకానుంది. ఇక ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్‌దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.