Payal Rajput – Prabhas : ప్రభాస్ కోసం ఆ వంట వండి నా చేత్తో తినిపిస్తాను.. పాయల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Payal Rajput Interesting Comments on Prabhas goes Viral
Payal Rajput – Prabhas : డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో జూన్ 27న కల్కి సినిమాతో రాబోతున్నాడు. మరోవైపు రాజా సాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ భారీ సినిమాల కోసం అభిమానులే కాక ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ గురించి అందరూ పొగుడుతారు. ముఖ్యంగా హీరోయిన్స్ ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి, ప్రభాస్ మంచితనం గురించి అభినందిస్తారు.
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని, ఆదివారాలు సపరేట్ గా ప్రభాస్ కోసం టైం కేటాయిస్తాను అని, ప్రభాస్ కలిస్తే అతని కోసం నేనే స్వయంగా వంట చేసి పెడతాను, అతనికి లంచ్ ఏర్పాటు చేస్తాను, ప్రభాస్ ఫుడ్ ఏది అడిగితే అది అరేంజ్ చేస్తాను. రాజ్మా రైస్ నా ఫేవరేట్ ఫుడ్. అది స్పెషల్ గా వండి నా చేత్తో ప్రభాస్ కి తినిపిస్తాను ఛాన్స్ వస్తే అని తెలిపింది.
Also Read : Lokesh Kanagaraj : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో షార్ట్ ఫిలిం.. లోకేష్ సినిమా ప్రపంచాన్ని చూపించడానికి..
దీంతో పాయల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పాయల్ ప్రభాస్ కి ఇంత పెద్ద అభిమానా అని ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నిన్న ప్రభాస్.. డార్లింగ్స్ మీకో స్పెషల్ పర్సన్ ని పరిచయం చేస్తాను అని పోస్ట్ పెట్టడం. అదే టైంకి పాయల్ కూడా నేను కూడా ఒకరికి డార్లింగ్ ని అని పోస్ట్ పెట్టడంతో పాయల్ – ప్రభాస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
#PayalRajput about our Darling #Prabhas ? pic.twitter.com/TufEoz1TJS
— INDRA SENA REDDY ?️ (@Indra_Reddy_29) May 17, 2024