Gold Price Hike : మళ్లీ కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?

గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పరుగులు తీస్తోంది. శుక్రవారం కాస్త శాంతించిన గోల్డ్ రేటు.. శనివారం మళ్లీ 2,400 డాలర్లను క్రాస్ చేసింది.

Gold Price Hike : మళ్లీ కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?

Gold

Updated On : May 18, 2024 / 3:43 PM IST

Gold Price Hike : గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పరుగులు తీస్తోంది. శుక్రవారం కాస్త శాంతించిన గోల్డ్ రేటు.. శనివారం మళ్లీ 2,400 డాలర్లను క్రాస్ చేసింది. ప్రస్తుతం గ్లోబల్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 2,415 డాలర్లు పలుకుతుంది. ఈ ఏడాది నవంబర్ నుంచి యూఎస్ వడ్డీ రేట్లలో కోత ప్రారంభం కావచ్చునని ప్రచారం నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ప్రత్యామ్నాయ పెట్టుబడిగా గోల్డ్ పై మక్కువ చూపుతున్నారు.

మరోవైపు, చైనా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చుననే ప్రచారంతో బంగారం ధరలో జోష్ పెరిగింది. ఇక.. హైదరాబాద్ మార్కెట్ లో శుక్రవారం కాస్త తగ్గిన గోల్డ్ ధర.. శనివారం మళ్లీ పెరిగింది. 10గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ.870 పెరిగి.. 74, 620కు చేరింది. ఇక 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ 68,400 కు పెరిగింది. అన్ని ట్యాక్సులు కలిపి హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10గ్రాముల ధర రూ. 76,360కి చేరింది. మరోవైపు వెండి ధర రికార్డు స్థాయికి చేరింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి రూ. లక్షకు చేరువలో ఉంది. శనివారం కిలో వెండి ధర రూ.4వేలు పెరిగి 96,500 పలుకుతుంది.