TS EAPCET Result 2024 : తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల.. టాప్ టెన్ ర్యాంకర్లు వీరే..

తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను శనివారం విడుదల చేశారు.

TS EAPCET Result 2024 : తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల.. టాప్ టెన్ ర్యాంకర్లు వీరే..

TS EAPCET

Updated On : May 18, 2024 / 12:22 PM IST

TS EAPCET Result 2024 Released : తెలంగాణ ఈఏపీ సెట్ (ఎప్‌సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈఏపీ సెట్ ను మొదటి సారిగా నిర్వహించామని తెలిపారు. గత ఏడాది వరకు ఎంసెట్ పేరు మీద పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

టీఎస్ ఈఏపీ సెట్ ప‌రీక్ష‌లు మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం వారికి, 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ వారికి నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈఏపీ సెట్ లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో లక్ష 432 మంది దరఖాస్తు చేసుకోగా 91 వేల 633 (91.24శాతం) మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 2 లక్షల 54 వేల 750 మంది దరఖాస్తు చేసుకోగా 2 లక్షల 40 వేల 618 (94.45 శాతం) మంది హాజరయ్యారని బుర్రా వెంకటేశం తెలిపారు.

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాప్ టెన్ లో ముగ్గురు అమ్మాయిలు నిలిచారు. తొలి ర్యాంకర్ గా ఆలూరు ప్రణీత నిలిచారు. ఆమె ఏపీకి చెందిన విద్యార్థిని. ఇంజనీరింగ్ విభాగంలో సతివాడ జ్యోతిరాధిత్య తొలి ర్యాంకర్ గా నిలిచాడు. ఈ విభాగంలో టాప్ టెన్ లో ఒక్క అమ్మాయి మాత్రమే చోటు దక్కించుకున్నారు.

 

  • EAPCET TOPPERS (అగ్రికల్చర్ & ఫార్మసీ)
  • 1st rank – ఆలూర్ ప్రణిత (అన్నమయ్య జిల్లా)
    2nd rank – నాగుడసారి రాధాకృష్ణ ( విజయనగరం జిల్లా)
    3rs rank – గడ్డం శ్రీ వర్షిణి (వరంగల్ జిల్లా)
    4th Rank – సోమ్ పల్లి సాకేత్ రాఘవ్ (చిత్తూరు జిల్లా)
    5th Rank – రేపాల సాయివివేక్ (హైదరాబాద్)
    6th Rank – మహ్మద్ అజాన్ సాద్ (మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా)
    7th Rank – వడ్లపూడి ముఖేశ్ చౌదరి (తిరుపతి జిల్లా)
    8th Rank – జెన్ని భార్గవ్ సుమంత్ (కుత్బుల్లాపూర్)
    9th Rank – జయశెట్టి ఆదిత్య (కూకట్ పల్లి)
    10th Rank – పూల దివ్యతేజ (శ్రీసత్యసాయి జిల్లా)
  • Agriculture ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

 

  • EAPCET TOPPERS (ఇంజనీరింగ్)
    1st rank – సతివాడ జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం జిల్లా)
    2nd rank – గొల్లలేఖ హర్ష (కర్నూల్ జిల్లా)
    3rd rank – రిషి శేఖర్ శుక్ల (సికింద్రాబాద్)
    4rd rank – భోగలపల్లి సందేశ్ (హైదరాబాద్)
    5rd rank – మురసాని సాయి యశ్వంత్ రెడ్డి (కర్నూల్ జిల్లా)
    6rd rank – పుట్టి కుశాల్ కుమార్ (అనంతపూర్ జిల్లా)
    7rd rank – హుందేకర్ విదిత్ (రంగారెడ్డి జిల్లా)
    8rd rank – రోహన్ సాయిపబ్బ (హైదరాబాద్)
    9rd rank – కొణతం మణితేజ (వరంగల్ జిల్లా)
    10rd rank – ధనుకొండ శ్రీనిధి (విజయనగరం జిల్లా)
    ఇంజనీరింగ్ లో టాప్ టెన్ లో ఒక్క అమ్మాయి మాత్రమే చోటు దక్కించుకున్నారు.