Saranga Dariya Song: మరోసారి బొమ్మ దద్దరిల్లడం ఖాయమట!

ఒక్కోసారి ఒక్కో పాట ఇండస్ట్రీని ఊపేస్తోంది. అలా ఈ మధ్య కాలంలో ఒక పాట తెగ ఊపేసింది. అదే సారంగ దరియా లిరికల్ సాంగ్. ఎప్పుడో ఏళ్ల క్రితం ఒక సింగింగ్ కాంపిటీషన్ లో వెలుగులోకి వచ్చిన ఈ పాట ఇప్పుడు చూరియా చూరియా అంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

Saranga Dariya Song: మరోసారి బొమ్మ దద్దరిల్లడం ఖాయమట!

Saranga Dariya Song Director Sekhar Kammula Confidence On Love Story Film

Saranga Dariya Song: ఒక్కోసారి ఒక్కో పాట ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఏ పాటలో ఏముందో ఆ విశ్లేషకులకు సైతం అర్థం కాదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఒక్కో పాట ఒక్కో రేంజిలో దూసుకెళ్తుంది. అలా ఈ మధ్య కాలంలో ఒక పాట తెగ ఊపేసింది. అదే సారంగ దరియా లిరికల్ సాంగ్. ఎప్పుడో ఏళ్ల క్రితం ఒక సింగింగ్ కాంపిటీషన్ లో వెలుగులోకి వచ్చిన ఈ పాట అప్పటి నుండి చాలా రకాలుగా మార్పులు చెంది యూట్యూబ్ లో చాలా పాటలుగా మారాయి. కానీ వాటికి దేనికి రాని గుర్తింపు లవ్ స్టోరీ సినిమాలోని పాటకి వచ్చింది. చూరియా చూరియా అంటూ ఈ పాట చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఇప్పటి వరకు స్టార్ హీరోలకు.. క్రేజీ ప్రాజెక్టులకు మాత్రమే సొంతమయ్యే రికార్డులు కూడా ఈ పాట సొంతం చేసుకుంది. ఒక నెలలోనే ఈ పాట 100 మిలియన్లకు పైగా యూట్యూబ్ వీక్షణలను సొంతం చేసుకుందంటే ఈ పాట జనాల్లోకి ఏ రేంజ్ లో వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ పాటలో కనీసం హీరో నాగ చైతన్య కూడా లేడు. హీరోయిన్ సాయిపల్లవి మ్యాజిక్.. మంగ్లీ గొంతుకు రచయిత సుద్ధాల అశోక్ తేజ రీమిక్స్ లిరిక్స్ తోడై ఈ పాట ప్రభంజనంగా మారింది. అలానే ఈ పాట వివాదం కూడా పబ్లిసిటీకి మరో కారణమైంది.

కాగా.. లవ్ స్టోరీ సినిమా ఈనెల 16న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో ఈ పాట పాత్ర అంతా ఇంతా కాదు. అయితే.. ఇలా సినిమా రిలీజ్ కు ముందు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన ఈ పాట సినిమాలో ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఇలా సినిమాకు ముందే భారీ క్రేజ్ తెచ్చుకున్న సినిమాల ఫలితాలలో అంచనాలు పెరిగిపోతుంటాయి. అదే ఒక్కోసారి సినిమాకు మైనస్ గా మారే అవకాశాలు ఉంటాయి. అయితే.. లవ్ స్టోరీ సినిమాకు కానీ.. సారంగ దరియా పాటకు కానీ లిరికల్ సాంగ్ హైప్ ఏ మాత్రం నెగటివ్ అయ్యే ఛాన్స్ లేదని దర్శకుడు శేఖర్ కమ్ముల ధీమాగా ఉన్నాడు.

సారంగదరియా లిరికల్ సాంగ్ మీద వీడియో సాంగ్ పదింతలు ఎక్కువగా ప్రేక్షకులకు నచ్చుతుందని శేఖర్ కమ్ముల చెప్తున్నాడు. పవన్ సంగీతానికి మంగ్లీ గొంతులో వచ్చే పాటకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సాయిపల్లవితో వేయించిన స్టెప్పులు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని శేఖర్ కమ్ముల చెప్తున్నాడు. మరి సినిమా ప్రమోషన్ లో కీలకమైన ఈ పాట సినిమా రిలీజ్ తరవాత కూడా అదే స్థాయిలో సినిమా సక్సెస్ అయ్యేందుకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సి ఉంది.