Tollywood : రైతు ఖాతాలో రూ. లక్ష జమ చేసిన శేఖర్ కమ్ముల

ఓ రైతు కుటుంబానికి అండగా నిలిచారు. ఆర్థిక సహాయాన్ని అందించారు. రైతుతో మాట్లాడిన శేఖర్ కమ్ముల..కుటుంబానికి అండగా ఉంటానని వెల్లడించారు

Tollywood : రైతు ఖాతాలో రూ. లక్ష జమ చేసిన శేఖర్ కమ్ముల

Sekhar Kammula

Updated On : October 26, 2021 / 7:07 PM IST

Sekhar Kammula Helped : టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఈయన తీసే సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి. కథలను తెరపై ఈయన అద్భుతంగా ఆవిష్కరిస్తుంటారు. చుట్టూ ఉన్న జీవితాలను పరిశీలిస్తూ..వాటిలో నుంచి తనకు కథ రావాల్సిన అంశాన్ని ఆయన తయారు చేసుకుంటుంటారు. ఆయన కథలు మనస్సుకు దగ్గరగా ఉంటాయి. సినిమాలే కాకుండా…సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా ఆయన స్పందిస్తుంటారు. తాజాగా..ఓ రైతు కుటుంబానికి అండగా నిలిచారు. ఆర్థిక సహాయాన్ని అందించారు. రైతుతో మాట్లాడిన శేఖర్ కమ్ముల..కుటుంబానికి అండగా ఉంటానని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే…

Read More : Aryan Khan Bail Petition : ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్..ఉత్కంఠ కంటిన్యూ

సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో ఈనెల 21వ తేదీన కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిళ్లు దగ్ధమైంది. ఈ క్రమంలో..కష్టపడి సంపాదించుకున్న సొమ్ము రూ. 6 లక్షలు బీరువాలో దాచుకున్నాడు. ఇల్లు దగ్ధం కావడంతో..ఆ సొమ్ము కాస్తా..మంటలకు ఆహుతయ్యాయి. దీంతో కాలిపోయిన నోట్ల కట్టలను పట్టుకుని ఆ రైతు విలపించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రైతును చూసి చాలా మంది చలించిపోయారు. ఈ విషయం శేఖర్ కమ్ములకు తెలిసింది.

Read More : Samantha: సమంతపై.. ఆ వీడియోలు తొలగించాల్సిందే: కోర్టు కీలక ఆదేశాలు

ఆ రైతుతో మాట్లాడారు. ఆ రైతు బ్యాంకు ఖాతా తెలుసుకుని..అందులోకి లక్ష రూపాయలు పంపించారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీనిచ్చారు. ఆపద కాలంలో ఆదుకొన్న వ్యక్తిగా మరోసారి వార్తల్లో నిలిచారు ఈయన. గతంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందించిన పారిశుధ్య కార్మికులకు తనవంతు సాయం చేశారు. ఆయన ప్రొడక్షన్ హౌస్ అమిగోస్ నుంచి సుమారు 1000 మంది కార్మికులకు నెల రోజుల పాటు పాలు, మజ్జిగ అందించారు శేఖర్ కమ్ముల.