Shubra Aiyappa : 150 ఏళ్ళ నాటి ఇంట్లో పెళ్లి చేసుకున్న హీరోయిన్..
కన్నడ భామ శుభ్ర అయ్యప్ప మోడలింగ్ తో ప్రయాణం మొదలుపెట్టి అనేక సంస్థలకి, యాడ్స్ కి మోడలింగ్ చేసింది. 2014లో ప్రతినిధి సినిమాతో తెలుగులో మెప్పించిన శుభ్ర ఆ తర్వాత తమిళ్ లో..................

Shubra Ayyappa married a business men in 150 years old home
Shubra Aiyappa : కన్నడ భామ శుభ్ర అయ్యప్ప మోడలింగ్ తో ప్రయాణం మొదలుపెట్టి అనేక సంస్థలకి, యాడ్స్ కి మోడలింగ్ చేసింది. 2014లో ప్రతినిధి సినిమాతో తెలుగులో మెప్పించిన శుభ్ర ఆ తర్వాత తమిళ్ లో సగప్తమ్ అనే సినిమా చేసింది. కన్నడలో వజ్రకాయ అనే సినిమా చేసిన తర్వాత దాదాపు 7 ఏళ్ళు సినిమాలకి దూరంగా ఉంది ఈ భామ.
2022లో మళ్ళీ కన్నడలో తిమయ్య అండ్ తిమయ్య అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు పలు కన్నడ సినిమాలలో నటిస్తుంది. తాజాగా ఈ భామ ఓ బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది. కర్ణాటకకు చెందిన విశాల్ అనే ఓ బిజినెస్ మెన్ ని శుభ్ర అయ్యప్ప ఇటీవల వివాహం చేసుకుంది.
Rajamouli : మోడ్రన్ మాస్టర్స్ అంటూ.. రాజమౌళి పై డాక్యుమెంట్..
శుభ్ర అయ్యప్ప తన వివాహానికి చెందిన ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. మాకు ప్రియమైన వారి సమక్షంలో నేనూ విశాల్ కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాం. విశాల్ పూర్వీకుల ఇల్లు దొడ్డమనేలో మా వివాహం జరిగింది. ఇది 150 ఏళ్ల క్రితంకి చెందిన పురాతనమైన ఇల్లు. ఈ మ్యాజికల్ ప్లేస్‌లో వివాహం జరగడం ఎంతో మధుర జ్ఞాపకం అని తెలిపింది. దీంతో పలువురు కన్నడ సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.