Sigguendukura Mama : మనం అమ్మాయిల్ని తిడితే బూతు.. వాళ్లు మనల్ని తిడితే స్వీటు..

‘‘SR క‌ళ్యాణమండంపం EST 1975’’.. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర నుంచి ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది..

Sigguendukura Mama : మనం అమ్మాయిల్ని తిడితే బూతు.. వాళ్లు మనల్ని తిడితే స్వీటు..

Sigguendukura Mama

Sigguendukura Mama: ‘రాజావారు రాణిగారు’ సినిమాతో యూత్‌ని ఆకట్టుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా.. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై ప్ర‌మోద్ – రాజు నిర్మాత‌లుగా, నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన సినిమా ‘‘SR క‌ళ్యాణమండంపం EST 1975’’. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర నుంచి ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

‘చుక్క‌ల చున్ని’, ‘చూసాలే క‌ళ్లార’ వంటి పాట‌లు యూట్యూబ్‌లో మిలియ‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. టీజ‌ర్‌ రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో ‘SR క‌ళ్యాణమండంపం EST 1975’ చిత్రం హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవ‌లే ఈ చిత్రాన్ని థియేట‌ర్లలో మాత్రమే విడుద‌ల చేస్తున్నామంటూ అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా అందుకు త‌గ్గ‌ట్లుగా నిర్మాత‌లు ప్ర‌మోద్ – రాజులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవ‌లే శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు. తాజాగా ‘SR క‌ళ్యాణమండంపం EST 1975’ చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి మ‌రో పాట‌ విడుద‌లైంది.

‘సిగ్గెందుకు రా మావా’.. అంటూ సాగే ఈ పాట‌ను బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ విడుద‌ల చేశారు. ఈ పాట‌లో హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం డ్యాన్స్ మూమెంట్స్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నాయి. అలానే సంగీత ద‌ర్శ‌కుడు ఈ పాట‌కు అందించిన ట్యూన్స్, భాస్కరభట్ల లిరిక్స్, అనురాగ్ కుల‌కుర్ణి అద్భుత‌మైన వాయిస్ కలిసిన ఈ పాట ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించ‌డం విశేషం.

విల‌క్ష‌ణ న‌టుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ నటి తులసి ఈ సినిమాలో కిరణ్ తల్లిదండ్రులుగా కనిపించనున్నారు. సాయికుమార్ క్యారెక్టర్ ఈ సినిమాకి మెయిన్ హైలెట్ కానుందట. ప‌రిస్థితులు సాధ‌ర‌ణ స్థాయికి వ‌చ్చి, థియేట‌ర్లు రీ ఓపెన్ అయిన తర్వాత ‘SR క‌ళ్యాణమండంపం EST 1975’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.