ఆడియన్స్ కోసం అదిరేటి ఫీచర్లతో సిగ్నల్..

ఆడియన్స్ కోసం అదిరేటి ఫీచర్లతో సిగ్నల్..

వాట్సాప్‌తో ప్రైవసీ పాలసీ వివాదం తర్వాత సిగ్నల్ మెసేజింగ్ యాప్ డౌన్‌లోడ్‌లు గణనీయంగా పెరిగిపోగా.. మిలియన్ల మంది వినియోగదారులు వాట్సాప్ నుండి సిగ్నల్‌కు జంప్ అయ్యారు. ఈ క్రమంలోనే సిగ్నల్ యాప్‌లో చాలా ఫీచర్స్ వాట్సాప్ కంటే భిన్నంగా అందుబాటులోకి తెస్తోంది సదరు మెసేజింగ్ యాప్. సిగ్నల్ మరియు టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ అనువర్తనాలు ఇటీవలికాంలో బాగా డౌన్‌లోడ్‌లు అవుతున్నాయి.

టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ సిఫారసు కారణంగా.. సిగ్నల్‌ డౌన్‌లోడింగ్‌లు విపరీతంగా ప్రాచుర్యం పొందగా.., సిగ్నల్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. జనవరి 11న తొలుత సిగ్నల్ యాప్‌కు సంబంధించిన ఫీచర్లను ప్రకటించింది. కొత్త ఫీచర్‌లతో చాట్ వాల్‌పేపర్‌లో అనేక ప్రీసెట్లు ఎంచుకోవచ్చు లేదా స్వంత ఫోటోలను సెట్ చేసుకోవచ్చు. ఒక నిర్దిష్ట సంభాషణ కోసం అన్నింటికీ వాల్‌పేపర్‌ను కూడా సెట్ చేయవచ్చు.

వర్చువల్ నంబర్ సిగ్నల్‌లో యాప్‌లోని అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే మీరు దీన్ని వర్చువల్ ఫోన్ నంబర్ ద్వారా ఉపయోగించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో మీ అసలైన మొబైల్ నెంబర్ ఎవరికీ తెలియదు. అలాగే సిగ్నల్ యాప్ మీ కాంటాక్ట్స్ లిస్ట్ ని ట్రాక్ చేయదు. రిజిస్ట్రేషన్ కోసం ఫోన్ నంబర్ అవసరం అయినప్పటికీ, సిగ్నల్ యాప్ వర్చువల్ నంబర్ ద్వారా ఓ‌టి‌పిని ధృవీకరిస్తుంది.

పిన్ యాక్టివేషన్ సిగ్నల్ యాప్ అక్కౌంట్ మీ ఫోన్ నంబర్‌కు లింక్ చేయదు. దీని ప్రత్యేకత ఏమిటంటే యాప్ రిజిస్ట్రేషన్ పిన్ ద్వారా జరుగుతుంది, దీని వల్ల మీ సమాచారం మీకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పిన్ కారణంగా సిగ్నల్ యాప్ వినియోగదారుని ట్రాక్ చేయడం చాలా కష్టం. మీరు ప్రైవసీ సెట్టింగ్‌లకు వెళ్లి రిజిస్ట్రేషన్ లాక్‌కి వెళ్లడం ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు. రీడ్ రిసిప్ట్స్ సిగ్నల్ యాప్ ప్రైవసీ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా మీరు ఆల్వేస్ రిలే కాల్స్‌ను ఆన్ చేయవచ్చు. అలాగే మీరు రీడ్ రిసిప్ట్స్ నిలిపి వేయవచ్చు. దీని ప్రయోజనం ఏమిటంటే మీ ఐ‌పి అడ్రస్ లీక్ అవ్వదు.

స్క్రీన్ టైమ్ అవుట్ అనవసరమైన సందేశాలను నిలువరించేందుకు ఒక నిమిషం పాటు స్క్రీన్ టైమ్ అవుట్ సెట్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత మీ యాప్ లాక్ అవుతుంది. దీని ద్వారా మీ యాప్‌ని, అనవసరమైన సందేశాలను ఇతరులు యాక్సెస్ చేయకుండా చేయవచ్చు. Allow from AnyOne ప్రైవసీ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా ఈ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఇతరులు లేదా తెలియని వారు మీకు మెసేజ్ చెయ్యడం కుదరదు. మీకు కావలసిన వ్యక్తులు మాత్రమే మీకు మెసేజ్ చేయడానికి వీలుంటుంది.

Disappearing Messages ఫీచర్ ద్వారా యాప్ మెసేజెస్ Displayని 5-10 సెకన్ల పాటు సెట్ చేయవచ్చు, ఆ తర్వాత మీ మెసేజ్ ఆటోమేటిక్‌గా డిలేట్ అయిపోతోంది. అలాగే మెయిన్ స్ట్రీమ్ మెసేజింగ్ యాప్‌లు ఏవైతే ఉన్నాయో వాటిలో వాడే ఫీచర్లను అందిస్తోంది సిగ్నల్.. వాల్‌పేపర్లు, యానిమేటెడ్ స్టిక్కర్లు, About సెక్షన్,, ఇలా అని అందుబాటులోకి వస్తున్నాయి.