Skull Metal Plate: టీమిండియా మాజీ కెప్టెన్ తల నుంచి మెటల్ ప్లేట్ తొలగింపు

భారత జట్టు మాజీ కెప్టెన్ నారీ కాంట్రాక్టర్ తల నుంచి డాక్టర్లు మెటల్ ప్లేట్ తొలగించారు. వెస్టిండీస్ బౌలర్ ఛార్లీ గ్రీఫిత్ వేసిన బౌన్సర్ తలకు బలంగా తాకడంతో ప్రమాదానికి గురయ్యాడు.

Skull Metal Plate: టీమిండియా మాజీ కెప్టెన్ తల నుంచి మెటల్ ప్లేట్ తొలగింపు

Nar I Contractor

Updated On : April 8, 2022 / 6:03 PM IST

Skull Metal Plate: భారత జట్టు మాజీ కెప్టెన్ నారీ కాంట్రాక్టర్ తల నుంచి డాక్టర్లు మెటల్ ప్లేట్ తొలగించారు. వెస్టిండీస్ బౌలర్ ఛార్లీ గ్రీఫిత్ వేసిన బౌన్సర్ తలకు బలంగా తాకడంతో ప్రమాదానికి గురయ్యాడు. తల వెనుక భాగంగా గట్టిగా తగిలిన తీవ్ర గాయానికి దారుణంగా దెబ్బతిన్నాడు. ఆ తర్వాత నారీ కాంట్రాక్టర్ కు చాలా ఆపరేషన్లు జరిగి చివరికి అదే సంవత్సరం తలలో టైటానియం ప్లేట్ అమర్చారు.

ప్రస్తుతం 88ఏళ్ల వయస్సులో ఉన్న అతని తండ్రికి 60 సంవత్సరాల తర్వాత తలలో అమర్చిన మెటల్ ప్లేట్ తొలగించినట్లు అతని కొడుకు హోషెదార్ కాంట్రాక్టర్ వివరించారు.

‘ఓ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఈ వయస్సులో దీనిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. కానీ, మా తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది. డా. హర్షద్ పరేఖ్, డా. అనిల్ టిబ్రేవాలా చాలా బాగా ఆపరేషన్ చేశారు’ అని వెల్లడించారు.

Read Also : 2,000 ఏళ్ల క్రితమే పుర్రెకు సర్జరీ..

గాయంతో పాటు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా 81పరుగులు చేసిన రికార్డ్ కూడా నారీ కాంట్రాక్టర్ పేరిట ఉంది.