world first skull surgery : 2,000 ఏళ్ల క్రితమే పుర్రెకు సర్జరీ..

2,000 ఏళ్ల క్రితం సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో పుర్రెకు ఆపరేషన్ చేసారు ఆనాటి డాక్టర్లు. యుద్ధంలో గాయపడిన పెరువియన్‌ పుర్రెకు చేసిన ఆపరేషన్ చూసి నేటి డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు

world first skull surgery : 2,000 ఏళ్ల క్రితమే పుర్రెకు సర్జరీ..

2000 Year Old Skull Shows Evidence Of Advanced Surgery

2000 year Old Peruvian warrior Skull Of Advanced Surgery: టెక్నాలజీతో వైద్యం రంగం పరుగులు పెడుతోందంటున్నాం. నేటి వైద్య రంగం సాంకేతికతతో ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాయని చెప్పుకుంటున్నాం. అటువంటి టెక్నాలజీతో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు చేసి రోగులకు పునర్జన్మనిస్తున్నారు డాక్టర్లు. గుండె తీసి గుండె పెడుతున్నారు.కిడ్నీలు, కాలేయాలు ఇలా ఒకటేంటీ ఎన్నో ఆపరేషన్లతో రోగులకు జీవితకాలాన్ని పెంచుతున్నారు. పంది గుండెను మనిషికి అమర్చి గ్రేట్ అనిపించుకున్నారు.

Also read : రియల్ ‘ఎవడు’ మూవీ : ప్రపంచంలోనే తొలి ‘ముఖ మార్పిడి’ ఆపరేషన్ సక్సెస్

ఇదంతా అత్యధునిక టెక్నాలజీతో జరుగుతున్న ఆపరేషన్లు. నేటి డాక్టర్లు చేసే ఈ ఘనతలు చాలా గొప్పవే..కానీ 2,000 ఏళ్లనాడు ఆపరేషన్లు చేసే డాక్టర్లకు ఇటువంటి సౌకర్యం లేదు. అయినా ఎన్నో ఆపరేషన్లు చేశారు. అటువంటి ఓ అసాధారణ ఆపరేషన్ గురించి ఇటీవలే బయటపడింది. పుర్రెకు వినూత్నమైన పద్ధతిలో చేసిన ఓ ఆపరేషన విషయం బయటపడటంతో పెద్ద పెద్ద డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు.

పురాతన కాలంలో కూడా అదీ 2,000 ఏళ్ల క్రితం సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా..ఏకంగా పుర్రెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ల గురించి ఇంకెంత గొప్పగా చెప్పుకోవాలి? అటువంటి ఓ ఆపరేషన్ ఇది అంటున్నారు నిపుణులు.

Also Read : దేశంలోనే మొదటిసారిగా..హైదరాబాద్ లో కరోనా పేషెంట్ కు ఊపిరితిత్తుల మార్పిడి

2,000 సంవత్సరాల నాటి పెరువియన్ యోధుడి పుర్రె లోహంతో కలిసి ఉంది. యూఎస్‌ మ్యూజియంలో ఉ‍న్న ఈ పుర్రె ఆనాటి ఆధేపిర శస్త్రచికిత్సకు ఒక ఉదాహరణగా చెబుతున్నారు పరిశోధకులు. ఆ పుర్రె ఓ యుద్ధంలో గాయపడిన పెరువియన్‌ది. అతని తలకు పెద్ద గాయం అయ్యిందని..దీంతో తలలోని ఎముకలను జాయింట్‌ చేయడానికి ఒక లోహపు (ఐరన్‌ ప్లేట్‌) ముక్కును ఉపయోగించి శస్త్ర చికిత్స చేశారని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Pig Heart: మనిషికి పంది గుండె.. ఆపరేషన్ సక్సెస్!

అంతేగాదు ఆ శస్త్ర చికిత్స చేయడం వల్లే ఆ మనిషి ప్రాణాలతో బయటపడ్డాడని కూడా గుర్తించారు. కానీ ఈ సర్జరీ జరిగిన సమయంలో అనస్థీషియా ఇచ్చారో లేదో అనేది కచ్చితంగా చెప్పలేమంటున్నారు. పురాతన కాలంలోనే అధునాతన శస్త్రచికిత్సలు చేయగల నైపుణ్యం కలిగి ఉన్నారని చెప్పడానికి ఈ పుర్రె కీలకమైన సాక్ష్యంగా పేర్కొనవచ్చు అని ఆస్టియాలజీ మ్యూజియం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఈ శస్త్ర చికిత్స కోసం ఆనాడు ఆపరేషన్ చేసిన నిపుణులు లోహాన్ని కరిగించి పోయేలేదని..దీరంరి ట్రెఫినేషన్‌ అని అంటారని.. తెలిపారు.