రియల్ ‘ఎవడు’ మూవీ : ప్రపంచంలోనే తొలి ‘ముఖ మార్పిడి’ ఆపరేషన్ సక్సెస్

రియల్ ‘ఎవడు’ మూవీ : ప్రపంచంలోనే తొలి ‘ముఖ మార్పిడి’ ఆపరేషన్ సక్సెస్

US : New Jersey man first successful face transplant : అమెరికా డాక్టర్లు అత్యంత అరుదైన ఘనత సాధించారు. 22 ఏళ్ల యువకుడికి ‘ముఖ మార్పిడి’ శస్త్ర చికిత్స చేసి విజయం సాధించారు. ఎలాగంటే టాలీవుడు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘ఎవడు’ సినిమాలోలాగా. ఆ సినిమాలో మంటల్లో కాలిపోయిన అల్లు అర్జున్ కు ఆపరేషన్లు చేసి రామ్ చరణ్ లాగా మార్చేస్తుండి డాక్టర్ గా నటించిన జయసుధ. అచ్చు అటువంటి అద్భుతమై ఆపరేషన్ చేసారు అమెరికా డాక్టర్లు. 80 శాతం కాలిపోయిన 22 ఏళ్ల యువకుడికి ఏడాది పాటు శ్రమించి అతని కొత్త రూపునిచ్చారు. ఈ అరుదైన ఆపరేషన్ ప్రక్రియలో 96మంది డాక్టర్లు పాల్గొన్నారు. ఆపరేషన్ తరువాత ఆ యువకుడు కోలుకున్నాడు.

అతని అవయవ పనితీరు బాగా మెరుగుపడింది. అతను బతికే అవకాశమే లేదనే స్థితి నుంచి అతను పూర్తిగా కోలుకునే స్థాయికి తీసుకొచ్చారు. కొత్త రూపుతో కొత్త జీవితాన్నిచ్చారు. పుట్టుకతో వచ్చిన మొహంతో కాకుండా.. పరిచయం లేని మొహంతో కొత్తగా ప్రపంచాన్ని పలకరిస్తున్నాడా యువకుడు. ఆఫీసు నుంచి ఇంటికి వెళుతుంటే ఘోర కారు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి మొహం పూర్తిగా కాలిపోయింది. ఒంటి నిండా 80 శాతం కాలిన గాయాలయ్యాయి. బతకడు అన్న మాట నుంచి.. బతికి ఓ అద్భుతాన్నే సృష్టించాడతడు.

రియల్ ‘ఎవడు’ స్టోరీ..న్యూ జెర్సీకి చెందిన .. 22 ఏళ్ల జో డైమియో. 2018 జులైలో నైట్ షిఫ్ట్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్నాడు. బాగా అలసిపోయి వున్నాడేమో మెల్లగా నిద్రమత్తు ఆవహించింది.. కళ్లు మూతలుపడ్డాయి..సడెన్ గా మెలకువ వచ్చి కళ్లు తెరిచి చూసే లోపు కారు పల్టీ కొట్టింది. భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ మంటల్లో అతడు కాలిపోయాడు. చేతి వేళ్లు తెగిపోయాయి. పెదాలు చిట్లిపోయాయి. కనుబొమ్మలు కనిపించకుండా పోయాయి. ముఖమంతా కాలిన గాయాలే. నల్లగా మారిపోయాడు. ఆ పరిస్థితుల్లో ఓ వ్యక్తి దేవుడిలా వచ్చి కాపాడాడు. కొన ఊపిరితో ఉన్న జోను ఆసుపత్రికి తరలించాడు. అతడిని చూసిన డాక్టర్లు బతకటం కష్టమన్నారు. 80పైనే కాలిపోయాడు.

అప్పటి నుంచి జో న్యూయార్క్ లాంగోన్ హెల్త్ ఆసుపత్రి డాక్టర్లు అతడిని బతికించటానికి చేయని యత్నమంటూ లేదు. ఎన్నెన్నో చికిత్సలు..ఎన్నెన్నో ఆపరేషన్లు. రెండున్నర నెలలు కృత్రిమ కోమాలో ఉంచి ఎన్నో ఆపరేషన్లు చేశారు. అతని ముఖం రూపురేఖలు లేకుండాపోయాయి. దాదాపు డాక్టర్లు అతని ముఖాన్ని మర్చిపోయారు.

ముఖం మార్చకపోతే లాభం లేదనుకున్నారు. దాత కోసం ప్రయత్నించారు. అప్పటికే జోకు కొన్ని టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో అతడికి సరిపోయే దాత దొరకడం కష్టమని తెలిసింది. కారణమేంటంటే..అతడి ప్రతి రక్షకాలు 94 శాతం దాతలను తిరస్కరించడమే. సరిపోయే దాత దొరికే అవకాశం కేవలం 6 శాతమే ఉందని డాక్టర్లు దృవీకరించారు. అలా దేశమంతా వెతకగా వెతగ్గా అతని అదృష్టం కొద్దీ అతడికి దాత దొరికాడు.

అలా గత ఏడాది ఆగస్టు 12న డాక్టర్లు జో డైమియోకు ‘ముఖ మార్పిడి’ విభాగ డైరెక్టర్ ఎడ్వార్డో రోడ్రిగెజ్ నేతృత్వంలో 96 మంది నిపుణుల బృందం 23 గంటలు శ్రమించి ‘ముఖ మార్పిడి’ శస్త్ర చికిత్సను ఎట్టకేలకూ విజయవంతం చేసింది. దాంతో పాటు జోకు రెండు చేతులనూ అమర్చింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని..బాధితుడి శరీరానికి తగ్గట్టు కొత్త ముఖం, చేతులు ప్రతిస్పందిస్తున్నాయని డాక్టర్ రోడ్రిగెజ్ తెలిపారు.

ఇటువంటివి రెండు ఆపరేషన్లు చేసినా అవి సక్సెస్ కాలేదని తెలిపారు డాక్టర్లు. మొదటి కేసులో మొహం ఇన్ ఫెక్షన్ వచ్చి ఆ వ్యక్తి చనిపోయాడని..రెండో కేసులో చేతులు అమర్చినా..పనిచేయలేదని..దీంతో మళ్లీ ఆ చేతులను తీసేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. దీంతో..ప్రపంచంలోనే విజయవంతమైన మొట్ట మొదటి ‘ముఖ మార్పిడి’ శస్త్రచికిత్స ఇదేనని డాక్టర్ రోడ్రిగెజ్ తెలిపారు.