దేశంలోనే మొదటిసారిగా..హైదరాబాద్ లో కరోనా పేషెంట్ కు ఊపిరితిత్తుల మార్పిడి

  • Published By: nagamani ,Published On : September 12, 2020 / 07:25 AM IST
దేశంలోనే మొదటిసారిగా..హైదరాబాద్ లో కరోనా పేషెంట్ కు ఊపిరితిత్తుల మార్పిడి

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లోని డాక్టర్లు అత్యంత అరుదైన ఆపరేషన్ చేసి ఘనతను సాధించారు. కరోనా మహమ్మారి సోకిన ఓ పేషెంట్ కు విజయవతంగా ఊపిరితిత్తుల ఆపరేషన్ చేశారు. నగరంలోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఈ ఘనతను సాధించటంతో పేషెంట్ ఆరోగ్యంగా కోలుకున్నాడు.


కరోనా మహమ్మారి ఊపిరితిత్తులపై ఎక్కువగా ఉంటుందనీ..అది అత్యంత ప్రాణాంతకమని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్న తెలిసిందే. కరోనా నయమైన తర్వాత కూడా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండడం..ఊపిరితిత్తులు, గుండె, కాలేయం వంటి కీలక అవయవాలపై వైరస్ ప్రభావం చాలాకాలం ఉంటుందని అనేక అధ్యయనాలు తెలిపాయి. కానీ కరోనా వచ్చిన పేషెంట్ కు ఊపిరితిత్తుల ఆపరేషన్ చేయటం అరుదనే చెప్పాలి. కానీ కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు చేసిన ఈ ఆపరేషన్ విజయవంతం కావటం ఆనందించాల్సిన విషయం.


పంజాబ్ కు చెందిన రిజ్వాన్ అనే 32ఏళ్ల యువకుడు సర్కోయిడోసిస్ సమస్యతో బాధపడుతున్నాడు. సర్కోయిడోసిస్ కారణంగా అతని రెండు ఊపిరితిత్తులు ఫైబ్రోసిస్ కు గురయ్యాయి. దీంతో రిజ్వాన్ రెండు ఊపిరితిత్తులను మార్చడమే పరిష్కారమని డాక్టర్లు నిర్ణయానికి వచ్చారు. ఇంతలో అతడు కరోనా వైరస్ బారిన పడ్డాడు. అతడి ఊపిరితిత్తులకు మరింత నష్టం జరుగుతోంది. కరోనా ప్రభావంతో మరింత ఇబ్బంది పడుతున్నాడు. అతడి పరిస్థితి కొన్నిరోజుల్లోనే క్షీణించింది.



https://10tv.in/car-driver-fined-rs-11000-for-blocking-ambulance/
దీంతో కరోనా వైరస్ సోకినప్పటికీ డాక్టర్లు ఎంతో శ్రమించి ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతం చేశారు. రిజ్వాన్ శనివారం (సెప్టెంబర్ 12,2020) హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాడు. దేశంలోనే ఊపిరితిత్తులు, గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో నిపుణుడిగా పేరు పొందిన డాక్టర్ సందీప్ అత్తావార్ నేతృత్వంలో ఈ అరుదైన సర్జరీ జరిగింది. కోల్ కతాలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన రెండు ఊపిరితిత్తులు రిజ్వాన్ కు అమర్చారు. దేశంలోనే ఈ తరహా ఆపరేషన్ జరగడం ఇదే మొదటిసారని కిమ్స్ డాక్టర్లు తెలిపారు.