108 శ్లోకాలతో విరాట్ రాసిన పుస్తకమే ‘సోలో బ్రతుకే సో బెటర్’..

10TV Telugu News

SBSB Promo: సుప్రీం హీరో సాయి తేజ్, నభా నటేష్ జంటగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’.. ఈ మూవీ ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సోమవారం ప్రోమో విడుదల చేశారు. రిలేషన్ షిప్ వద్దు, ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ యూత్‌ని మోటివేట్ చేయడానికి విరాట్ 108 శ్లోకాలతో రాసిన పుస్తకమే ‘సోలో బ్రతుకే సో బెటర్’ అని ప్రోమోలో చూపించారు.

డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం : థమన్, కెమెరా : వెంకట్ సి దిలీప్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా.